ASBL Koncept Ambience

అమెరికా తెలంగాణ మహాసభల్లో భద్రాద్రి రాముడి కళ్యాణం

అమెరికా తెలంగాణ మహాసభల్లో భద్రాద్రి రాముడి కళ్యాణం

హ్యూస్టన్‌ నగరంలో జూన్‌ 29 నుంచి జరిగే అమెరికా తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో జరిగే ప్రపంచ తెలంగాణ మహాసభల్లో భద్రాద్రి రాముడి కల్యాణోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇక్కడ నిర్వహించిన అనంతరం కెనడా, సింగపూర్‌, మలేషియా, తదితర దేశాల్లో కూడా భద్రాచల రాముని కల్యాణం జరగనుందని, ఆటా కో-ఆర్డినేటర్‌, ప్రముఖ నాట్య కళాకారిణి పద్మజారెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని లక్డీకాపూల్‌ సెంట్రల్‌ కోర్టు హోటల్‌లో జరిగిన సమావేశంలో ఆమె భద్రాచలం ఆలయ అర్చకుడు మదన్‌మోహనాచార్యులు తో కలిసి మాట్లాడారు.

అమెరికాలోని హోస్టన్‌ నగరంలో ఈ నెల 29, 30, జూలై 1వ తేదీలో తనతోపాటు శిష్య బ ందం న త్య ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆటా ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో రసమయి బాలకష్ణ బందం కళాకారులు కూడా పాల్గొంటారని తెలిపారు. దాదాపు 10వేల మంది హాజరయ్యే ఈ కార్యక్రమంలో క్లాసికల్‌ నత్యంతో పాటు నవదుర్గలు అనే అంశంపై ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు తెలిపారు. జూలై 1న భద్రాచలం నుంచి సీతారాముల విగ్రహాలను తీసుకెళ్లి ఆ ఆలయ అర్చకులతో కల్యాణం జరిపించనున్నట్లు తెలిపారు. దీనికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకిరణ్‌రెడ్డితో పాటు పలువురు హాజరవుతారన్నారు. మదన్‌మోహనాచార్యులు మాట్లాడుతూ భద్రాచలం రామయ్య కల్యాణం ఇతర దేశాల్లో నిర్వహించడం వల్ల లోకకల్యాణం జరుగుతుందన్నారు.

 

Tags :