ASBL Koncept Ambience

అభివృది, సంక్షేమ పథకాలే టీడీపీని గెలిపిస్తాయి

అభివృది, సంక్షేమ పథకాలే టీడీపీని గెలిపిస్తాయి

సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ, టీడీపీ స్థానిక అసెంబ్లీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరాదేవి హిందూపురంలోని 42వ  పోలింగ్‌ బూత్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యూలో నిల్చుని బాలయ్య ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. హిందూపురంలో తాను చేసిన అభివృద్ధి, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే టీడీపీని గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అనంతరం పోలింగ్‌ స్టేషన్‌లో సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓటు వేసేందుకు వచ్చిన ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్లిపోయారు.

 

Tags :