ASBL Koncept Ambience

మళ్లీ అధికారం టీడీపీదే

మళ్లీ  అధికారం టీడీపీదే

అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్న చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, అత్యధిక స్థానాలు గెలుస్తామని సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో బాలకృష్ణ నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పసుపు కుంకుమ, పింఛన్ల పెంపు, రైతు రుణమాపీ, అన్నదాత సుఖీభవతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రజలకు అందించిందన్నారు. ఈ పథకాలే టీడీపీకీ విజయానికి నాంది పలుకుతాయన్నారు. వైసీపీకీ శవ రాజకీయాలు చేయడం అలవాటే అని ఎద్దేవా చేశారు.

 

Tags :