ASBL Koncept Ambience

హిందూపురంలో బాలయ్య విజయం

హిందూపురంలో బాలయ్య విజయం

హిందూపురం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే బాలకృష్ణ విజయం సాధించారు. మొదటి నుంచి ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వస్తున్న బాలయ్య సమీప వైసీపీ అభ్యర్థి మహ్మద్‌ ఇక్బాల్‌పై గెలుపొందారు. నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి ఆ పార్టీకి హిందూపురం కంచుకోటగా ఉంది. రామారావు తర్వాత హిందూపురం నుంచి హరికృష్ణ గెలుపొందారు. ఆయన చంద్రబాబు కెబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 2014 నుంచి బాలయ్య హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో కూడా బాలకృష్ణను హిందూపురం ప్రజలు గెలిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్‌ గాలి జోరుగా వీస్తున్న తరుణంలో జిల్లాలో బాలకృష్ణ మాత్రమే టీడీపీ ఖాతా తెరిచారు. జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. హిందూపురం మినహా మిగతా 13 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.

 

Tags :