బాటా 50వ వార్షికోత్సవ వేడుకలను జయప్రదం చేయండి.. సతీష్ వేమూరి, తానా సెక్రెటరీ
"వచ్చే నెలలో జరిగే బాటా వేడుకలు విజయ వంతం చేయాల్సిన బాధ్యత అందరి మీద వుంది. గత 50 ఏళ్లు గా బే ఏరియా లో తెలుగు వారికి అన్నీ విషయాలలోనూ చేదోడు వాదోడుగా వున్న బాటా తో మన అందరికీ అనుబంధం వుంది. ఈ వేడుక మన వేడుక" అన్నారు తానా కార్యదర్శి శ్రీ సతీష్ వేమూరి.
బాటా 50 వ వార్షికోత్సవ వేడుకల కోసం డబ్లిన్ ఏరియా లో పీకాక్ బాంక్వెట్ హల్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం లో శ్రీ సతీష్ వేమూరి, శ్రీ వినయ్ పరచూరి తదితరులు మాట్లాడారు.
ముందుగా బాటా అధ్యక్షులు శ్రీ హరి చేకోటి మాట్లాడుతూ బాటా 50వ వార్షికోత్సవ వేడుకలు గురించి వివరించారు. శ్రీమతి విజయ ఆసూరి వేడుకల కోసం చేస్తున్న సన్నాహాలు వివరించి...ఈ వేడుక బే ఏరియా లో తెలుగువారి 50 సంవత్సరాలు ప్రయాణం అని అన్నారు.
శ్రీ వీరు వుప్పల 50 సంవత్సరాల బాటా గురించి తయారు చేసిన వీడియో, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను ప్రదర్శించి వివరించారు. కార్య వర్గ సభ్యులు శ్రీ ప్రసాద్ మంగిన, శ్రీ కళ్యాణ కట్టమూరి, శ్రీ కరుణ్ వెలిగేటి, శ్రీలు వెలిగేటి, శ్రీ కొండల్, శ్రీ కిరణ్ విన్నకోట, శ్రీదేవి తదితరులు మాట్లాడారు.