బాటా స్వర్ణోత్సవ వేడుకలు.. తమన్ సంగీత కచేరీ, అవధానం, జబర్దస్త్ కార్యక్రమాలు
బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) స్వర్ణోత్సవ వేడుకలకు అంతా రెడీ అయింది. అక్టోబర్ 22వ తేదీన శాంతాక్లారా కన్వెన్షన్ సెంటర్‌లో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నది. ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకు వివిధ కార్యక్రమాలతో అందరినీ ఉల్లాసపరిచేందుకు బాటా కమిటీ ఏర్పాట్లు చేసింది. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ సంగీత కచేరీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నది. యాంకర్, సినీనటి అనసూయ ఉమెన్స్ ఫోరం వాళ్ళు ఏర్పాటు చేసిన నారీ కార్యక్రమం ద్వారా ఆకట్టుకోనున్నది. ఫణి నారాయణ వీణా వాద్య కచేరీ, అవధానసామాట్ర్ మేడసాని మోహన్ సాహిత్య కార్యక్రమం వంటివి ఈ స్వర్ణోత్సవ వేడుకల్లో హైలైట్‌గా నిలవనున్నది. జబర్దస్త్ టీమ్ చేసే కామెడి మరో హైలైట్‌గా నిలవనున్నది. దీంతోపాటు స్థానిక కళాకారులతో వివిధ సాంస్కృతిక ప్రదర్శనలను కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. డ్యాన్స్, మ్యూజికల్, కామెడీ నాటికలు, జానపద కళాప్రదర్శనలు ఇలా ఎన్నో మధురమైన కార్యక్రమాలు వచ్చిన వారిని ఉల్లాసపరిచేలా నిర్వహిస్తున్నట్లు బాటా నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి మీడియా పార్టనర్‌గా తెలుగుటైమ్స్ వ్యవహరిస్తోంది.
ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు కూడా వస్తున్నారని, అలాగే ప్రత్యేక సావనీర్‌ను కూడా ఈ వేడుకల్లో బాటా టీమ్ రిలీజ్ చేయనున్నది.