ఘనంగా 'బాటా' దీపావళి వేడుకలు
బే ఏరియా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలను వైభవంగా నిర్వహించారు. బాటా నిర్వహించే వేడుకల్లో ప్రతిష్టాత్మమైన వేడుకగా దీపావళిని భావిస్తారు. బే ఏరియా వాసులు కూడా ఈ దీపావళి వేడుకల కోసం ఎదురు చూస్తుంటారు. మొదటిసారిగా ఈ వేడుకలను శాన్‌రామన్ - డబ్లిన్ ట్రైవ్యాలీ (గాలే రాంచ్ మిడిల్ స్కూల్) దగ్గర నిర్వహించారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ వేడుకలు సాగాయి. యు స్మైల్ డెంటల్ సమర్పించిన ఈ వేడుకలకు గ్రాండ్ స్పాన్సర్‌గా పిఎన్‌జి జ్యూవెల్లర్స్ వ్యవహరించింది. ప్లాటినం స్పాన్సర్‌గా మై ట్యాక్స్ ఫైలర్, గోల్డ్ స్పాన్సర్స్‌గా అపెక్స్ కన్సల్టింగ్, రెమిట్ 2 ఇండియా డాట్ కమ్, విజిటర్స్ గురు (విజిటర్స్ ఇన్‌స్యూరెన్స్ పార్టనర్), కోనసీమ కిచెన్ ఫుడ్ స్పాన్సర్‌గా ఉంది. వాడీలాల్ ఐస్‌క్రీమ్, రియల్టర్ రమణ రెడ్డి (కాల్ హోమ్స్), నీరాజి (సంపూర్ణ వాస్తు), పాఠశాల (తెలుగు స్కూల్), రియల్టర్ సయ్యద్ అహ్మద్, బెస్ట్‌బ్రైన్స్ (శాన్‌రామన్), విజేత సూపర్‌మార్కెట్, మీడియా పార్ట్‌నర్స్‌గా విరిజల్లు, బాలీ 92.3 వ్యవహరించింది. దీపావళి వెలుగులు విరజిమ్మేలా దీపాలను, పువ్వులను ఆడిటోరియం వద్ద అందంగా అలంకరించారు.
సాయంత్రం 5 గంటలకు బాటా అడ్వయిజర్ విజయ ఆసూరి అతిధులను వేదికపైకి ఆహ్వానించారు. లిటిల్ కిడ్స్ - టీన్స్ డ్యాన్స్‌లు, బాటా యూత్ టీమ్ చేసిన డ్యాన్స్‌లు ఉల్లాసపరిచాయి. బాటా కల్చరల్ టీమ్ సభ్యులు ఫ్రీమాంట్, శాన్‌రామన్, మిల్‌పిటాస్, కుపర్టినో, శాన్‌హోసె వంటి చోట్ల సాంస్కృతిక కార్యక్రమాలపై ముందుగానే శిక్షణను ఇచ్చాయి.
టాలీవుడ్ యాక్టర్స్ నిఖిల్, అవికగోర్ వేడుకలకు రావడం హైలైట్‌గా నిలిచింది. వారిద్దరూ అందరితోనూ కలిసిపోయి మాట్లాడుతూ, అందరినీ ఉత్సాహపరుస్తూ, ఫన్ గేమ్స్‌ను నిర్వహించారు. ఇండియన్ ఐడల్ విన్నర్ రేవంత్, వృథ్వీచంద్ర, మౌనిమ సూపర్ డూపర్ హిట్‌సాంగ్స్‌ను పాడారు. స్టేజిమీద వారితో కలిసి చిన్నారులు, పెద్దలు ఆడుతూ కార్యక్రమాన్ని బాగా ఎంజాయ్ చేశారు. బాటా టీమ్ ఈ వేడుకలను బాగా నిర్వహించిందని, సంప్రదాయాన్ని మరచిపోకుండా కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు వక్తలంతా బాటాను అభినందించారు. శాన్‌రామన్ వైస్ మేయర్ ఫిల్ ఓ లోన్, శాన్‌రామన్ ప్రధాన పోలీస్ అధికారి క్రెగ్ స్టీవెన్స్, శాన్‌రామన్ సిటీ పార్క్స్ కమిషనర్ శ్రీధర్ వెరోస్, డబ్లిన్ స్కూల్ బోర్డ్ ప్రెసిడెంట్ అమి మిల్లర్, స్టూడెంట్ రిప్రజెంటెటివ్ టిన్ని ముఖర్జీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బాటా ప్రెసిడెంట్ యశ్వంత్ కుదరవల్లి మాట్లాడుతూ, ఈ వేడుకలను విజయవంతం చేసినవారందరికీ ధన్యవాదాలను తెలియజేశారు. బాటా టీమ్‌ను ఆయన అందరికీ పరిచయం చేశారు. హరినాథ్ చికోటి (వైస్ ప్రెసిడెంట్), సుమంత్ పుసులూరి (సెక్రటరీ), కొండల్ రావు (ట్రెజరర్), అరుణ్ రెడ్డి (జాయింట్ సెక్రటరీ), స్టీరింగ్ కమిటీ సభ్యులు రవి తిరువీధుల, కామేష్ మల్ల, కళ్యాణ్ కట్టమూరి, శిరీష బత్తుల, కల్చరల్ డైరెక్టర్స్ శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, తారకదీప్తి, నామినేటెడ్ కమిటీ సభ్యులు ప్రశాంత్ చింత, వరుణ్ ముక్క, హరి సన్నిధిని పరిచయం చేశారు.
బాటా అడ్వయిజరీ బోర్డ్ జయరామ్ కోమటి, విజయ ఆసూరి, వీరు ఉప్పల, ప్రసాద్ మంగిన, కరుణ్ వెలిగేటి, రమేష్ కొండ, తదితరులు ఈ వేడుకను చక్కగా నిర్వహించినందుకు బాటాను అభినందించారు.