ASBL Koncept Ambience

పాటలతో అలరించిన బాటా దీపావళి

పాటలతో అలరించిన బాటా దీపావళి

బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ (బాటా) ‘దీపావళి’ వేడుకలను అందరినీ అలరించే పాటలతో ఘనంగా జరుపుకుంది. బాటా నిర్వహించే ముఖ్యమైన కార్యక్రమాల్లో దీపావళి వేడుకలు ఒకటి. బే ఏరియా తెలుగు కమ్యూనిటీలో బాగా ప్రాచుర్యం పొందిన ఈ ఈవెంట్‌కు స్థానిక సంఘాల నుంచి కూడా మద్దతు లభించింది.

కాలిఫోర్నియాలోని మిల్పిటాస్‌లోని ఇండియా కమ్యూనిటీ సెంటర్‌లో నవంబర్‌ 3వ తేదీ సాయంత్రం 6:00 గంటలకు ప్రారంభమైన కార్యక్రమం రాత్రి 11:00 గంటల వరకు కొనసాగింది. ప్రముఖ టాలీవుడ్‌ గాయకురాలు మంగ్లీ-ఇంద్రావతి యొక్క ప్రత్యక్ష సంగీత కచేరీ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. మరచిపోలేని వేడుకగా నిలిచేలా చేసింది. 

ఈ వేడుకకు అసోసియేట్‌ స్పాన్సర్‌గా ‘‘సంజయ్‌ టాక్స్‌ప్రో’’ వ్యవహరించగా, పవర్‌డ్‌ బై రియల్టర్‌ ‘‘నాగరాజ్‌ అన్నయ్య’’, గ్రాండ్‌ స్పాన్సర్‌ ఎవిఆర్‌ చౌదరి (జి అండ్‌ సి గ్లోబల్‌), గోల్డ్‌ స్పాన్సర్‌ - శ్రీని గోలి రియల్‌ ఎస్టేట్స్‌ సిల్వర్‌ స్పాన్సర్‌లుగా పిఎన్‌జి జ్యువెలర్స్‌,TESQA.AI & VYZN రియల్టీ, ఫుడ్‌ స్పాన్సర్స్‌గా శ్రీ కిచెన్‌ వ్యవహరించింది. ఈ కార్యక్రమానికి తెలుగు పాఠశాల, విరిజల్లు రేడియో మద్దతు ఇచ్చింది. ఈ వేడుకల్లో భాగంగా దుస్తులు, నగలు, రియల్‌ ఎస్టేట్‌, విద్య-ఆరోగ్య సంరక్షణ విక్రేతల బూత్‌లను కూడా ఏర్పాటు చేశారు. 

ఈ వేడుకల్లో సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చేవారిని బాటావారు ముందుగానే  వివిధ ప్రదేశాలలో శిక్షణా తరగతులను నిర్వహించి సన్నద్ధం చేశారు. ఫ్రీమాంట్‌, శాన్‌ రామన్‌, డబ్లిన్‌, మిల్పిటాస్‌, కుపెర్టినో, శాన్‌ జోస్‌లలో ఈ శిక్షణ జరిగింది. దాదాపు 150 మందికి పైగా పిల్లలు,  యువకులు వివిధ ఫుట్‌ ట్యాపింగ్‌ డ్యాన్స్‌లలో పాల్గొన్నారు. బాటా బృందానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ వేడుకల్లో హైలైట్‌గా టాలీవుడ్‌ ప్రముఖ గాయకులు మంగ్లీ, ఇంద్రవతి (ఊ అంటావా), అనిరుద్ధల లైవ్‌ కాన్సర్ట్‌ నిలిచింది. మంగ్లీ సూపర్‌/డూపర్‌ పెప్పీ హిట్‌ పాటలను ఒకదాని తర్వాత ఒకటి పాడి అందరినీ మెప్పించారు. 

బాటా అధ్యక్షుడు కొండల్‌ కొమరగిరి వాలంటీర్‌లందరూ కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బాటా ఎగ్జిక్యూటివ్‌ కమిటీని పరిచయం చేశారు. శివ కదా, వరుణ్‌ ముక్క, హరి సన్నిధి ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

స్టీరింగ్‌ కమిటీ సభ్యులు రవి తిరువీదుల, కామేష్‌ మల్ల, శిరీష బత్తుల, యశ్వంత్‌ కుదరవల్లి, సుమంత్‌ పుసులూరి
సాంస్కృతిక కమిటీ సభ్యులు శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, తారక దీప్తి
లాజిస్టిక్స్‌ టీమ్‌ సందీప్‌ కేదారి సెట్టి, సురేష్‌ శివపురం, రవి పోచిరాజు 
యూత్‌ కమిటీ - సంకేత్‌, ఉదయ్‌, ఆది, గౌతమి, సందీప్‌, హరీష్‌
బాటా అడ్వయిజరీ కమిటీ నాయకులు జయరాం కోమటి, విజయ ఆసూరి, వీరు వుప్పల, ప్రసాద్‌ మంగిన, కరుణ్‌ వెలిగేటి, రమేష్‌ కొండా, కళ్యాణ్‌ కట్టమూరి, హరినాథ్‌ చీకోటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు బాటా బృందాన్ని అభినందించారు. 

 

Click here for Event Gallery

 

 

Tags :