ASBL Koncept Ambience

బాటా కార్యక్రమాలు విజయం వెనుక ఉన్న రథసారధులు

బాటా కార్యక్రమాలు విజయం వెనుక ఉన్న రథసారధులు

బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ ఇప్పుడు 50వ వార్షికోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. ఈ వేడుకలను విజయవంతం చేసేందుకు బాటా నాయకులు ఎంతో కృషి చేస్తున్నారు. బాటా అధ్యక్షులుగా పనిచేసిన పలువురు తమ పదవీకాలం పూర్తయిన తరువాత కూడా బాటా అభివృద్ధికి, కార్యక్రమాల విజయవంతానికి ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే బాటా యువ కార్యవర్గానికి మద్దతుగా నిలుస్తున్నారు. వారిలో ప్రసాద్‌ మంగిన, వీరు ఉప్పల, విజయ ఆసూరి, రమేష్‌ కొండ, కళ్యాణ్‌ కట్టమూరి, కరుణ్‌ వెలిగేటి, శ్రీలు వెలిగేటి, శిరీష బత్తుల, శ్రీదేవి పసుపులేటి. వీరంతా తమకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ, బాటా కార్యక్రమాల విజయవంతానికి పాటుపడుతున్నారు.

ప్రసాద్‌ మంగిన స్పాన్సర్స్‌, మార్కెటింగ్‌ వ్యవహారాలను చూస్తుంటారు. కార్యక్రమాల విజయవంతానికి అవసరమైన స్పాన్సర్లను సంప్రదించడం, వారిని ఆహ్వానించటం, మార్కెటింగ్‌ చేయడం వంటి కార్యక్రమాలను ఆయన చేస్తుంటారు. అలాగే రమేష్‌ కొండ బాటా నిర్వహించే కార్యక్రమాలకు ప్రముఖులను ఆహ్వానించడం వంటివి చేస్తుంటారు. కాన్సులర్‌ జనరల్‌, కాంగ్రెస్‌మెన్‌లను, ఇతర ప్రముఖులను సంప్రదించి వారిని ప్రత్యేకంగా ఆహ్వానించడం వంటివి చేస్తారు. వీరు ఉప్పల కార్యక్రమాల వేదిక, బ్యాక్‌ గ్రౌండ్‌, ఆడియో వ్యవహారాలను చూస్తుంటారు. విజయ ఆసూరి ఓవరాల్‌గా కార్యక్రమాలను పర్యవేక్షించడంతోపాటు అవసరమైన సూచనలు, సలహాలను ఇస్తుంటారు. కార్యక్రమాలకు యాంకర్‌గా కూడా వ్యవహరిస్తుం టారు. కరుణ్‌ వెలిగేటి ఎలక్ట్రానిక్‌ ప్రచార వ్యవహారాలను, పిపిటి వంటివి తయారు చేయడం, ప్రోగ్రామ్‌ షీట్స్‌ రూపకల్పన వంటివి చేస్తుంటారు. కళ్యాణ్‌ కట్టమూరి తన విరిజల్లు ద్వారా బాటా కార్యక్రమాల విజయవంతానికి మీడియా ప్రచారం చేస్తుంటారు.

శ్రీలు వెలిగేటి, శిరీష బత్తుల, శ్రీదేవి పసుపులేటి కార్యక్రమాలకు అవసరమైన పిల్లలను తయారు చేయడం, వారికి అవసరమైన కాస్ట్యూమ్స్‌ రెడీ చేయడం, రిహార్సల్‌ వంటివి చేయించడం ఇతర వ్యవహారాలను చూస్తుంటారు. వీరంతా బాటా కార్యక్రమాల విజయవంతానికి కృషి చేస్తుంటారు. మరోవైపు బాటా ప్రెసిడెంట్‌ అందరితో కలిసి కార్యక్రమాలకు అవసరమైన సహాయాన్ని అందిస్తుంటారు. బాటాలో ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఎన్నిక కూడా ప్రజాస్వామ్య యుతంగానే ఉంటుంది. వరుస జాబితా ప్రకారం అధ్యక్షులను ఎంపిక చేస్తుంటారు. మరోవైపు కమ్యూనిటీకి అవసరమైన సేవలతోపాటు భాషా పరిరక్షణకు కూడా బాటా కృషి చేస్తుంటుంది.

 

Tags :