ASBL Koncept Ambience

వినూత్నంగా జరిగిన బాటా సంక్రాంతి వేడుకలు

వినూత్నంగా జరిగిన బాటా సంక్రాంతి వేడుకలు

బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ (బాటా) ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. వంటల పోటీలు, ముగ్గుల పోటీలు  బొమ్మలకొలువు, సంగీత విభావరి, శాస్త్రీయ నృత్యరూపకాలు, స్టేజ్‌ గేమ్‌ షోలు వంటి కార్యక్రమాలు వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేశారు. దాదాపు 1000 మందికిపైగా ప్రేక్షకులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

వేడుకలను నిర్వహించిన ఆడిటోరియంను సంక్రాంతి వైభవాన్ని తలపించేలా అలంకరించారు. బాటా కరవోకె టీమ్‌ ఆధ్వర్యంలో పాటల పల్లకి కార్యక్రమంతో వేడుకలను ప్రారంభించారు. మరోవైపు సూపర్‌ చెఫ్‌ పోటీలను పెద్దలకు, లిటిల్‌ చెఫ్‌ పోటీలను చిన్నారులకు నిర్వహించారు. ముగ్గులపోటీలను, చిత్రలేఖన పోటీలు, వ్యాసరచన పోటీలను కూడా ఏర్పాటు చేశారు. చిన్నారులు ఇంటి నుంచి వంటలకు అవసరమైన సరకులను తీసుకువచ్చి ఆడిటోరియంలోనే తమ వంటకాన్ని తయారు చేసి అందరికీ రుచి చూపించారు. పెద్దలు కూడా సూపర్‌ చెఫ్‌ పోటీల్లో తమ వంటల ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు.

'పాఠశాల' విద్యార్థులు వేడుకల్లో ప్రదర్శించిన సత్యహరిశ్చంద్ర నాటకం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ప్రముఖ నాటక కళాకారుడు రవి నరాలశెట్టి ఈ నాటకాన్ని రచించడంతోపాటు దర్శకత్వ బాధ్యతలను కూడా చేపట్టారు. శాన్‌రామన్‌ పాఠశాల పిల్లలు బూరెల మూకుడు నాటకాన్ని వేశారు. బే ఏరియాలో దాదాపు 7 కేంద్రాల్లో 250 మందికిపైగా పిల్లలకు తెలుగు భాషను పాఠశాల నేర్పిస్తున్న సంగతి తెలిసిందే. సాయంత్రం 5 గంటలకు ప్రధాన కార్యక్రమం ప్రారంభమైంది. బాటా సలహాదారు విజయ ఆసూరి తొలుత చిన్నారులను ఆహ్వానించారు. భోగిపళ్ళ కార్యక్రమంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. పెద్దలు చిన్నారులను ఆశీర్వదించారు. గొబ్బెమ్మల డ్యాన్స్‌, శివ నూపురం క్లాసికల్‌ డ్యాన్స్‌ స్కూల్‌ పిల్లలు ప్రదర్శించిన దశావతారం, మార్కండేయ చరిత్ర డ్యాన్స్‌లు ఆకట్టుకున్నాయి. బాటా యువతీయువకులు టాలీవుడ్‌ హిట్‌సాంగ్స్‌ను పాడి అందరినీ హుషారులో ముంచారు.

అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండో అమెరికన్స్‌ (ఎఐఎ) కూడా రిపబ్లిక్‌ డే వేడుకలను వైభవంగా నిర్వహించింది. కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియన్‌ అంబాసిడర్‌ సంజయ్‌ పాండ ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్‌ కోమటి, ఫ్రీమాంట్‌ వైస్‌ మేయర్‌ రాజ్‌ సల్వాన్‌, యాష్‌ కల్రా ఆఫీస్‌ ప్రతినిధి స్టేతీషి, మరో అసెంబ్లీ సభ్యుడు కాన్‌సేన్‌ చు ప్రతినిధి అనురాగ్‌ పాల్‌, శాన్‌హోసె వైస్‌ మేయర్‌, శాన్‌ఫ్రాన్సిస్కో మాజీ మేయర్‌ డా. ప్రదీప్‌ గుప్తా, మిల్‌పిటాస్‌ మాజీ మేయర్‌ జోస్‌ ఎస్టీవ్స్‌తోపాటు పలువురు కౌన్సిల్‌ సభ్యులు ఈ వేడుకలకు అతిధులుగా వచ్చారు. ఈ?సందర్భంగా మాట్లాడిన వక్తలు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ, బాటా, ఎఐఎ చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు. ఈ?సందర్భంగా బాటా కరవోకె టీమ్‌, చిన్నారులు పాడిన దేశభక్తి పాటలను, డ్యాన్స్‌లను అందరూ తిలకించారు. జగదేక వీరుడు అతిలోక సుందరి కార్యక్రమం కూడా ఆకట్టుకుంది. వీడియో, ఆడియో గేమ్స్‌ షో కూడా అందరికీ నచ్చేలా సాగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య స్పాన్సర్‌గా యు స్మైల్‌ డెంటల్‌ వారు వ్యవహరించారు. గ్రాండ్‌ స్పాన్సర్‌గా పిఎన్‌జి జ్యూవెల్లర్స్‌, సంజయ్‌ ట్యాక్స్‌ ప్రో, గోల్డ్‌ స్పాన్సర్‌గా అపెక్స్‌ కన్సల్టింగ్‌, విజిటర్స్‌ ఇన్‌స్యూరెన్స్‌ పార్ట్నర్‌గా విజిటర్స్‌ గురు వ్యవహరించింది. రమణా రెడ్డి (కాల్‌ హోమ్స్‌), పాఠశాల, స్వాగత్‌ ఇండియన్‌ కుజిన్‌, సంగీత దుత్తా (న్యూయార్క్‌ లైఫ్‌), సయ్యద్‌ అహ్మద్‌ (ఇంటెరో), పిఎన్‌జె 5. డాట్‌ కమ్‌, కోస్తా కర్రీస్‌ ఇతర స్పాన్సర్లుగా వ్యవహరించాయి. విరిజల్లు తెలుగు రేడియో, తెలుగు టైమ్స్‌ మీడియా స్పాన్సర్లుగా ఉన్నాయి. బాటా ప్రెసిడెంట్‌ యశ్వంత్‌ కుదరవల్లి మాట్లాడుతూ, ఈ వేడుకలను విజయవంతం చేసిన బాటా టీమ్‌ను, సభ్యులను, వలంటీర్లను అభినందించారు. బాటా టీమ్‌ను ఆయన అందరికీ పరిచయం?చేశారు. హరినాథ్‌చికోటి (వైస్‌ ప్రెసిడెంట్‌), సుమంత్‌ పుసులూరి (సెక్రటరీ), కొండల్‌ రావు (ట్రెజరర్‌), అరుణ్‌ రెడ్డి (జాయింట్‌ సెక్రటరీ), స్టీరింగ్‌ కమిటీ సభ్యులు రవి తిరువీధుల, కామేష్‌ మల్ల, కళ్యాణ్‌ కట్టమూరి, శిరీష బత్తుల, కల్చరల్‌ డైరెక్టర్లు శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, తారక దీప్తి, నామినేటెడ్‌ కమిటీ సభ్యులు ప్రశాంత్‌ చింత, వరుణ్‌ ముక్కా, హరి సన్నిధిని పరిచయం చేశారు. బాటా సలహాదారులు జయరామ్‌ కోమటి, విజయ ఆసూరి, వీరు ఉప్పల, ప్రసాద్‌ మంగిన, కరుణ్‌ వెలిగేటి, రమేష్‌ కొండ వేడుకను విజయవంతం చేసిన బాటాటీమ్‌ను అభినందించారు.

Click here for Event Gallery

 

Tags :