బాటా ఉగాది వేడుకలు...
బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు అందరినీ మైమరపింపజేశాయి. దాదాపు 2,000మందికిపైగా అతిధులు హాజరైన ఈ వేడుకలకు సంజయ్ ట్యాక్స్ ప్రో గ్రాండ్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. నాగరాజు అన్నయ్య (పవర్డ్ బై), శ్రీని గోలి రియల్ ఎస్టేట్స్ (గోల్డ్ స్పాన్సర్)తోపాటు ఐసిఐసిఐ బ్యాంక్, పిఎన్‌జి జ్యూవెల్లర్స్, రైట్ కేర్, టెస్వా,ఎఐ, సాగర్ కోత (రియల్టర్), పాఠశాల (తెలుగు స్కూల్), వైన్ ఇండియా ప్రాపర్టీస్ కూడా ఈ వేడుకలకు మద్దతిచ్చాయి.
సంప్రదాయబద్ధంగా ఉగాది వేడుకలను ఉగాది పచ్చడిని పంపిణీతో ప్రారంభించారు. వేడుకలు జరిగిన ప్రాంతం అంతా పండుగ కోలాహలం కనిపించేలా అలంకరించారు. యూత్ టాలెంట్ షోతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 400మందికిపైగా చిన్నారులు ప్రదర్శించిన కార్యక్రమాలు అందరినీ అలరించాయి. తెలుగు రాష్ట్రాల రుచులను తలపించేలా ఫుడ్ ఫెస్టివల్‌ను నిర్వహించారు. దుస్తులు, జువ్వెల్లరి మేళా కూడా ఆకట్టుకుంది. సాయంత్రం 5 గంటలకు బాటా అడ్వయిజర్ విజయ ఆసూరి స్వాగతోపన్యాసంతో ప్రారంభమయ్యాయి. దాదాపు 100 మందికిపైగా చిన్నారులు వివిధ రకాల నృత్యాలతో అలరించారు. కళాతపస్వి కె. విశ్వనాథ్ చిత్రంలోని దొరకునా ఇటువంటి సేవ పాట, హిట్టయిన పాటలను పాడారు. తారలు దిగివచ్చిన వేళ, రాధికా కృష్ణ, నాకూ ఫీలింగ్స్ ఉంటే వంటి పాటలను పాడారు. హైలైట్‌గా ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు బాటా టీమ్‌తోపాటు ఆడియన్స్ కూడా డ్యాన్స్ చేయడం విశేషం.
ఈ ఉగాది పండగ ఉత్సవానికి శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారతదేశ కాన్సల్ జనరల్ డా. టీ వీ నాగేంద్ర ప్రసాద్, యుఎస్ కాంగ్రెస్‌మెన్ ఆర్.ఓ. ఖన్నా ముఖ్య అతిధులుగా హాజరై అందరికీ ఉగాది శుభాకాంక్షలను తెలియజేశారు.
బాటా ప్రెసిడెంట్ హరినాథ్ చికోటి ఈ ఉగాది వేడుకలను విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. బాటా కమిటీని ఈ సందర్భంగా పరిచయం చేశారు.
ఎగ్జిక్యూటివ్ కమిటీ - హరినాథ్ చికోటి (ప్రెసిడెంట్), కొండల్‌రావు (వైస్ ప్రెసిడెంట్), అరుణ్ రెడ్డి, శివ కద, వరుణ్ ముక్క
స్టీరింగ్ కమిటీ సభ్యులు - రవి తిరువీధుల, కామేశ్ మల్ల, శిరీష బత్తుల, యశ్వంత్ కుదరవల్లి, సుమంత్ పుసులూరి
కల్చరల్ కమిటీ సభ్యులు - శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, తారక దీప్తి, కిరణ్ విన్నకోట
లాజిస్టిక్ టీమ్ - హరి సన్నిధి, సురేశ్ శివపురం, శరత్ బాబు
యూత్ కమిటీ - సంకేత్, ఉదయ్, ఆదిత్య, సందీప్, గౌతమి, హరీష్
ఆర్ట్ అండ్ డిజైన్ కమిటీ - కళ్యాణి చికోటి, దీప్తి కొఠారి, స్రవంతి కాకరాల, నవీన పాలేటి, కృష్ణ మంగిన
బాట అడ్వయిజరీ బోర్డ్ - జయరామ్ కోమటి, విజయ ఆసూరి, వీరు ఉప్పల, ప్రసాద్ మంగిన, కరుణ్ వెలిగేటి, రమేష్ కొండ, కళ్యాణ్ కట్టమూరి ఈ సందర్భంగా వేడుకలను విజయవంతంగా నిర్వహించినందుకు బాటా టీమ్‌ను అభినందించారు.
తరువాత హరినాథ్ కొత్త బాటా కార్యవర్గాన్ని పరిచయం చేశారు. 2023`25 సంవత్సరానికిగా కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీ బాధ్యతలను చేపట్టింది. కొత్త ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన కొండల్‌రావు కొమరగిరి మాట్లాడుతూ, తనకు బాధ్యతలు అప్పగించినందుకు బాటా నాయకులకు అందరికీ ధన్యవాదాలు చెప్పారు. అందరితో కలిసి పనిచేసి బాటాకు మరింత పేరు తీసుకువస్తానని తెలిపారు.
బాటా కమిటీ స్పాన్సర్లకు ఇతరులకు ధన్యవాదాలను తెలియజేసింది.
తానా కమిటీ సభ్యులు సతీష్ వేమూరి, రామ్ తోట తదితరులు ఈ వేడుకలకు హాజరై తానా మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ వేడుకల్లో తెలుగుటైమ్స్ 20వ వార్షికోత్సవ వేడుకలను కూడా నిర్వహించారు.