ASBL Koncept Ambience

లండన్‌లో ఘనంగా బతుకమ్మ

లండన్‌లో ఘనంగా బతుకమ్మ

తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం యూకే, యూరప్‌ ఆధ్వర్యంలో లండన్‌లో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. లండన్‌ బార్కింగ్‌ లోని బార్కింగ్‌ అబ్బె స్కూల్‌ హాల్‌లో నిర్వహించిన ఉత్సవాలకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన దాదాపు 500 మంది హాజరయ్యారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో టీడీఎఫ్‌ యూకే, యూరప్‌ సభ్యులు కమల్‌ ఓరుగంటి, శ్రీనివాస్‌రెడ్డి పింగిళి, రాజు చక్రి, శశికృష్ణ గోవింద్‌, శ్రవణ్‌ ఉప్పల, జూపల్లి ప్రవీణ్‌, నాగరాజు అడ్డగల్ల, రాజేంద్ర పూజారి, శ్రీకాంత్‌ కాంచనపల్లి, మాదాల శ్రీనివాస్‌, శ్రీకాంత్‌ బెల్డె, నగేశ్‌ బత్తుల, డాక్టర్‌ మోహన్‌, డాక్టర్‌ కమల్‌ పాల్గొన్నారు.

 

 

Tags :