ASBL Koncept Ambience

బెర్లిన్‌లో బతుకమ్మ వేడుకలు

బెర్లిన్‌లో బతుకమ్మ వేడుకలు

జర్మనీ తెలంగాణ సంఘం (ట్యాగ్‌) ఆధ్వర్యంలో బెర్లిన్‌లో బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. జర్మనీలోని దాదాపు రెండు వేల కుటుంబాలు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నాయని నిర్వహకులు తెలిపారు. ట్యాగ్‌ అధ్యక్షుడు చలిగంటి రఘు నేతృత్వంలో ఏర్పాట్లు చేశారు. బెర్లిన్‌లోని భారత రాయబార కార్యాలయం టాగూర్‌ కేంద్రం సంచాలకురాలు మాలతీరావు, న్యూకాల్స్‌ ప్రజాప్రతినిధి సుసానా, స్థానిక ఆలయ ప్రతినిధులు జయరాంనాయుడు, విశ్వనాథన్‌ కృష్ణమూర్తి, ట్యాగ్‌ ప్రతినిధులు జీవన్‌రెడ్డి, స్వేచ్ఛారెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు పెద్దఎత్తున బతుకమ్మలను పేర్చి పాటలు పాడుతూ నృత్యాలు చేశారు.

 

Tags :