ASBL Koncept Ambience

పిట్స్ బర్గ్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు..

పిట్స్ బర్గ్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు..

పిట్స్‌బర్గ్‌ నగరంలో బతుకమ్మ పండుగను ఎన్నారై మహిళలు ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ దుస్తులు ధరించి ఈ వేడుకల్లో 350 మందికిపైగా తెలంగాణ ఆడపడచులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా తీర్చిదిద్దారు. వాటి చుటూ ఎంతో భక్తిశ్రద్ధలతో బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ సందడిగా గడిపారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేసి.. మలీదా ప్రసాదాన్ని పంచుకున్నారు. అందంగా అలంకరించిన బతుకమ్మలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను నిర్వాహకులు అందించారు. అనంతరం అందరూ పసందైన తెలంగాణ వంటకాలను ఆరగించారు. తెలంగాణ కుటుంబాలు ఇలా ఒకే చోట  కలుసుకొని పండుగ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఈ  బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న వారందరూ అభిప్రాయపడ్డారు. ఇక ఈ వేడుకల్లో పాల్గొన్న వారికి, వాలంటీర్లకు, స్పాన్సర్లకు కన్వీనర్లు కృతజ్ఞతలు తెలియజేశారు.

 

 

Tags :