నాశవిల్లీ, టెన్నిసీ పట్టణములో వైభవముగా బతుకమ్మ ఉత్సవములు
కలవారి కోడలు ఉయ్యాలో, బతకమ్మ బతకమ్మ ఉయ్యాలో అని తెలంగాణ సంసృతి ఉట్టి పడేల టెన్సీస తెలుగు సమితి ఆద్వర్యంలొ అంగరంగ వైభవంగా జరిగావి. దసరా పండగను పురస్కరించుకొని నాశవిల్లి నగర ప్రజలందరూ ప్రాంతీయ భేదాలు లేకుండా బతకమ్మ సంబరాలు ఘనముగ నిర్వహించిరి. సుమారు 700 మంది తెలుగు వారు సాంప్రదాయ దుస్తులలో హజరు అయినారు. వచ్చిన మహిళలు వివిద రకాల ప్వువ్వులతో బతుకమ్మలను అందముగ పేర్చిరి. తదుపరి బతుకమ్మల చుట్టూ చేరీ కనుల పండగగా బతకమ్మ పాటలు ఆడి పాడిరి.
టెన్నిసి తెలుగు సమితి అద్యశ్ళలు శామ్ జాలం, కార్యదర్శి శ్రీమతి మంజుల లిక్కి, కోశాధికారి వేణు అలోక్ మరియు సభ్యులు వంశీ ధారా, శ్రీమతి శిరీష ధారా, శ్రీమతి దీపా పీటపల్లీ, శ్రీమతి అనూరాధ మోతె, శ్రీమతి శ్రీరంజని ఆలపాటి,శ్రీమతి నిశిత కాకాని,శ్రీమతి శిల్పా మహాదీ, శ్రీమతి స్వాతీ పోలపల్లి, మనోహర్ గుడివాడ,గణేశ రేవల్ల, మరియు శ్రీరాం అందరూ కలసి చక్కగ నిర్వహించిరి.