ASBL Koncept Ambience

ఖమ్మం జిల్లాలో బత్తినేని ట్రస్టు - తానా వైద్యశిబిరం

ఖమ్మం జిల్లాలో బత్తినేని ట్రస్టు - తానా వైద్యశిబిరం

బోనకల్‌ మండలంలోని  నారాయణపురంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), బత్తినేని చారిటబుల్‌ ట్రస్టు కలిసి నారాయణపురం, చిన్నబీరవల్లి గ్రామాల్లో పలు సేవా కార్యక్రమాలకు నిర్వహించాయి. ఈ కార్యక్రమాల్లో ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ గడిపల్లి కవిత పాల్గొన్నారు. ట్రస్ట్‌ చైర్మన్‌ బత్తినేని నాగ ప్రసాద్‌ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని ఈ సందర్భంగా ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. క్యాన్సర్‌ వ్యాధి నిర్దారణ శిబిరాన్ని శ్రీనివాస రెడ్డి ప్రారంభిస్తూ ఊరిపై ఉన్న మమకారంతో బత్తినేని నాగ ప్రసాద్‌ పలు సేవా కార్యక్రమాలను చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రాయన్నపేట, నారాయణపురం గ్రామాలకు మంచినీటి సరఫరా ట్యాంక్‌ను, నారాయణపురం పాఠశాలకు డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌ సెట్‌ను ఎంపి చేతుల మీదుగా ప్రారంభించారు. హైదరాబాద్‌లోని ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌ వైద్యులు ఈ క్యాన్సర్‌ నిర్దారణ?శిబిరంలో పాల్గొని పేదలకు పరీక్షలు చేశారు. ఈ  వైద్యశిబిరానికి అధిక సంఖ్యలో ప్రజలు తరలొచ్చి ఉచితంగా పరీక్షలు చేయించుకున్నారు. ట్రస్ట్‌ సభ్యులు బత్తినేని ప్రకాష్‌, రాకేష్‌తోపాటు తానా అధ్యక్షుడు  జంపాల చౌదరి, తానా ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ సతీష్‌ వేమన, తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌ గోగినేని తదితరులు, స్థానిక ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

 

 

 

Tags :