ASBL Koncept Ambience

"ఆటా సభల నిర్వాహణలో హౌస్టన్ పాత్ర కీలకమైనది" : భువనేశ్ బూజల

"ఆటా సభల నిర్వాహణలో హౌస్టన్ పాత్ర కీలకమైనది" : భువనేశ్ బూజల

1-3 జూలై న వాషింగ్టన్ డిసి లో జరిగే 17 వ ఆటా మహా సభలకు హౌస్టన్ వాసులను స్వయం గా ఆహ్వానించటానికి ఆటా అధ్యక్షులు శ్రీ భువనేష్ బూజల హౌస్టన్ వచ్చిన సందర్భంగా స్థానిక ఆటా నాయకులు నగరం లో గోదావరి రెస్టారెంట్ లో గురువారం, 9 జూన్ తేదీ సాయత్రం ఒక చక్కటి కార్యక్రమం నిర్వహించారు.

హౌస్టన్ పట్టణ తెలుగు ప్రముఖులు శ్రీ బంగారు రెడ్డి, శ్రీ శ్రీధర్ కంచనకుంట్ల, శ్రీ దామోదర్ జమ్మి, శ్రీ రాజ్ చపిడి తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా ఆటా అధ్యక్షులు శ్రీ భువనేశ్, ఆటా డైరెక్టర్ శ్రీ సన్నీ రెడ్డి, శ్రీ నర్సి రెడ్డి, పూర్వ ఆధ్యక్షులు  శ్రీ శ్రీనివాస పిన్నపరెడ్డి తదితరులు ప్రసంగించారు.

ఆటా అధ్యక్షులు శ్రీ భువనేశ్ మాట్లాడుతూ ఆటా సభలలో హౌస్టన్ నగర పాత్ర చాలా ముఖ్యమైనదని, గత మూడు దశాబ్దలలో హౌస్టన్ నుంచి వచ్చిన ఆటా నాయకుల సేవలు మరవలేవని, అలాగే ఇప్పుడు కూడా హౌస్టన్ నుంచి $250000 స్పాన్సర్స్ గా హౌస్టన్ నగర వాసి శ్రీ రఘు సుంకి, ఫోర్ ఓక్స్ ఇన్సూరెన్స్ గ్రూప్ నుంచి ముందుకు వచ్చారని, ఈ విధమైన స్పాన్సర్షిప్ ఇంతవరకు ఏ సంస్థ తీసుకోలేదని, చిరకాలం గుర్తుండి పోయే నిర్ణయం అని తెలిపారు.

శ్రీ శ్రీధర్ కంచన కుంట్ల , శ్రీ బంగారు రెడ్డి ఈ కార్యక్రమం లో తెలుగు కల్చరల్ సెంటర్ అధ్యక్షులు శ్రీ కిరణ్ నెక్కంటి,  గ్రేటర్ హౌస్టన్ తెలంగాణ తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీ నారాయణ రెడ్డి, తెలుగు భవన్ నుంచి శ్రీ రాజ్ శేఖర, శ్రీ రాజ్ చముడి, ఐ టీ సర్వ్, నాటా, నాట్స్, తానా లాంటి అనేక తెలుగు సంస్థ ల నాయకులను పిలిచి, వారిని ఆటా తరుపున గౌరవించి ఆటా సభలకు ఆహ్వానించారు. తెలుగు టైమ్స్ ఎడిటర్ శ్రీ సుబ్బారావు చెన్నూరి కూడా ఈ సభలో పాల్గొని ఆటా తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడే జరిగే ఆటా సభల గురించి, శ్రీ భువనేశ్ నాయకత్వం గురించి తెలిపారు.

 

 

Tags :