ASBL Koncept Ambience

తానా 2023 ఎన్నికలు ... ఈ-ఓటింగ్‌ ప్రక్రియకు ఆమోదముద్ర

తానా 2023 ఎన్నికలు ... ఈ-ఓటింగ్‌ ప్రక్రియకు ఆమోదముద్ర

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2023 ఎన్నికల్లో మరో ముఖ్యమైన నిర్ణయంను తానా బోర్డు తీసుకుంది. గతంలోలాగా తానాలో బ్యాలెట్‌ పేపర్ల మీద కాకుండా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌కు ఆమోదముద్ర పడింది. ఈ మేరకు ఇటీవల జరిగిన బోర్డ్‌ సమావేశంలో సాధారణ మెజారిటీతో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. తానా 2023 ఎన్నికలు అంతర్జాలంలో ఈ-ఓటింగ్‌ ద్వారా నిర్వహించేందుకు మాజీ అధ్యక్షుడు డా.బండ్ల హనుమయ్య నేతృత్వంలోని తానా బోర్డు ఆమోదముద్ర తెలిపింది. దీని ప్రకారం సభ్యులకు 2023 ఎన్నికల్లో వారి చిరునామాలకు పోస్టల్‌ బ్యాలెట్లు పంపించరు. తానా ఎన్నికల కమిటీ ఆధ్వర్యంలో సభ్యులు తమ ఓటు హక్కును అంతర్జాలంలో వినియోగించుకుని సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఎలక్ట్రానిక్స్‌ ఓటింగ్‌ వల్ల ఒకే అడ్రస్‌పై ఎంతోమందిని చేర్పించిన బ్యాలెట్‌ కలెక్టర్లకు చెక్‌ పెట్టే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. ఓటరుకు తెలియకుండానే వారి బ్యాలెట్‌ పేపర్‌ను తీసుకుని ఓటు వేసుకునేందుకు ఇక వీలుకాదని అంటున్నారు. మొత్తం మీద ఇ-ఓటింగ్‌ వల్ల అక్రమాలకు తెరపడుతుందని పలువురు పేర్కొంటున్నారు. 

 

 

Tags :