బోయిసి తెలుగు అసోసియేషన్ ఉగాది వేడుకలు
బోయిసి తెలుగు అసోసియేషన్(బీటీఏ) ఆధ్వర్యంలో మార్చి24న ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సుమారు మూడు వందల మంది బీటీఏ సభ్యులు పాల్గొన్నారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా వినూత్న కార్యక్రమాలతో అతిథులను అలరించారు. మొదట'మా తెలుగు తల్లికి మల్లెపూదండ' గీతాలాపనతో వేడుకలు ప్రారంభమయ్యాయి. చిన్నారుల విభాగంలో.. తెలుగు బడి పిల్లల సంస్క త శ్లోకాలు, బాల భక్తులు, టాలీవుడ్ న త్యాలు, కిలిక్కి డాన్స్, తెలుగు తనం ఉట్టిపడే న త్య మాలిక వంటి ప్రదర్శనల తో వీక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ హౌలీస్, బోయిసి పవర్ స్టార్ దివస్ న త్యాలతో హాల్ దద్దరిల్లింది.
పెద్దల విభాగంలో.. హంగామా డాన్స్, మధుర గీతాలు, సెమి క్లాసికల్ న త్యాలతో అలరించారు. ముఖ్యంగా శివ తాండవ స్తోత్రమ్ న త్యం, బోయిసిలో మొదటిసారి ప్రదర్శించిన పౌరాణిక నాటకం తెలుగు సంస్క తిని ప్రతిబింబించింది. కార్యక్రమం విజయవంతగా నిర్వహించడానికి క షి చేసిన వారిని జ్ఞాపికలతో సత్కరించారు. అనంతరం బీటీఏ లక్ష్యాల గురించి అధ్యక్షులు బ్రహ్మ రెడ్డి ఎనుముల మాట్లాడుతూ ''తెలుగు సంస్క తి, సంప్రదాయాలు, గొప్పదనాన్ని తరవాత తరాలకు తెలియజేయడమే ముఖ్య ఉద్దేశం'' అని తెలిపారు. అనంతరం జరిగిన పరిచయకార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు రాజ్ కుమార్ మంతెన, ఉపాధ్యక్షులు సుబ్బు కొమ్మిరెడ్డి , కార్యదర్శి రమ్య తాతపూడి , కోశాధికారి ప్రదీప్ రెడ్డి కొలను.. నిర్వాహకులు సాయి గిల్లా ని సభకు పరిచయం చేశారు. ఈ ఉగాది వేడుకలకు పెద్దఎత్తున తెలుగుకుటుంబాలవారు తరలివచ్చారు.