ASBL Koncept Ambience

వినోజ్ చనుమోలు ఇంట్లో జయరామ్ అభినందన సమావేశం

వినోజ్ చనుమోలు ఇంట్లో జయరామ్ అభినందన సమావేశం

చికాగోలో తెలుగు కమ్యూనిటీ ఏర్పాటు చేసిన అభినందన సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన జయరామ్‌ కోమటికి స్థానిక తెలుగు కమ్యూనిటీ ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇల్లినాయిలోని నాపర్‌విల్లెలో ఉన్న వినోజ్‌ చనుమోలు ఇంట్లో జరిగిన కార్యక్రమానికి తానా నాయకులు, జయరామ్‌ కోమటి తదితరులు హాజరయ్యారు. ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఆయనను నియమంచినందుకు అభినందిస్తూ ఏర్పాటు చేసిన కేక్‌ను కట్‌ చేసిన తరువాత జయరామ్‌కు అందరూ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షుడు గంగాధర్‌ నాదెళ్ళ, తానా ప్రెసిడెంట్‌ జంపాల చౌదరి, తానా ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ సతీష్‌ వేమ, డా. వెంకట సుబ్బారావు ఉప్పులూరి, డా. అక్కినేని మణి, డా. సుదర్శన్‌ అక్కినేని, మధు తాతా, హేమ కానూరు, రాజా సూరపనేని, అశోక్‌ బాబు కొల్లా, జగదీష్‌ కానూరు, శివ పోలవరపు, సత్యనారాయణ రెడ్డి కందిమళ్ళ, నరేంద్ర చేమర్ల, ప్రదీప్‌ రెడ్డి కందిమళ్ళ, రజని ఆకురాతి, లింగయ్య మన్నె, హరీష్‌ కొలసాని, హరి కుమార్‌, వెంకట్‌ గొట్టిపాటి, శ్రీధర్‌ ఎర్రంసెట్టి, కళ్యాణ్‌ బొందలపాటి, యుగంధర్‌ వాకాలపూడి ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు రాష్ట్ర అభివృద్ధికి తమవంతు చేయూతను అందిస్తామని జయరామ్‌ కోమటికి తెలియజేశారు. 

 

Tags :