బిజినెస్ సెమినార్...
న్యూజెర్సిలో నాట్స్ ఆధ్వర్యంలో మే 26 నుంచి 28 వరకు అంగరంగ వైభవంగా జరిగే అమెరికా తెలుగు సంబరాల్లో వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు వైభవంగా జరిగే ఈ సంబరాలు ఎడిసన్‌లోని న్యూజెర్సి కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పొజిషన్ సెంటర్‌లో జరగనున్నాయి. ఈ సంబరాల్లో భాగంగా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకోసం బిజినెస్ సెమినార్ లను కూడా ఏర్పాటు చేశారు. అమెరికాలో స్మాల్ బిజినెస్ ఎక్స్‌పర్ట్‌గా పేరు పొందిన బిల్ వాల్ష్ తో బిజినెస్‌లో సక్సెస్ సాధించడంపై ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సక్సెస్ కావడానికి అవసరమైన సూచనలను ఆయన ఈ బిజినెస్ సెమినార్‌లో అందజేయనున్నారు. 3 పిల్లర్స్ టు సక్సెస్, బిజినెస్ గ్రోత్ స్ట్రాటజీస్, అడ్వాన్స్‌డ్ బిజినెస్ సిస్టమ్స్, రిలేషన్ షిప్ మార్కెటింగ్, పైపులైన్ మేనేజ్‌మెంట్, టర్న్ ఇన్పిరేషన్ టు సక్సెస్ వంటి విషయాలపై ఆయన ప్రసంగించనున్నారు.
ది షార్క్ ట్యాంక్ ఎక్స్‌పీరియన్స్ పేరుతో మరో కార్యక్రమాన్ని కూడా బిజినెస్ సెమినార్ కమిటీ ఏర్పాటు చేసింది. స్టార్టప్ లు ఏర్పాటు చేయాలనుకున్నవారు ఈ బిజినెస్ సెమినార్ కు వచ్చి అవసరమైన ప్రతిపాదనలు సమర్పిస్తే జడ్జిలు ఉత్తమైన వాటిని ఎంపిక చేస్తారు. వాటికి ప్రైజ్ మనీ బహుకరించనున్నారు. అలాగే దానికి అవసరమైన పెట్టుబడులకోసం ఇన్వెస్టర్ లను కూడా సంప్రదించుకునే అవకాశాన్ని కల్పిస్తారు.
బిజినెస్ వర్గాలకు ఉపయోగపడే సమాచారంతో నిర్వహించే ఈ బిజినెస్ సెమినార్‌లకు అందరూ హాజరుకావాలని బిజినెస్ కమిటీ కోరుకుంటోంది.