ASBL Koncept Ambience

నాటా బిజినెస్‌ సెమినార్‌

నాటా బిజినెస్‌ సెమినార్‌

డల్లాస్‌లో జూన్‌ 30 నుంచి జూలై 2వ తేదీ వరకు డల్లాస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించే నాటా మహాసభల్లో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలతోపాటు సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. బిజినెస్‌ రంగంలో కూడా తెలుగువారికి సహాయపడేందుకు వీలుగా మహాసభల్లో బిజినెస్‌ సెమినార్‌లను కూడా ఏర్పాటు చేశారు. నిష్ణాతులైన బిజినెస్‌ ప్రముఖులతో జరిగే చర్చా సమావేశాలు, ప్రసంగాలు  యువ పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడేలా నిర్వహిస్తున్నారు. వివిధ అంశాలపై వక్తలతో ప్రసంగాలు ఇందులో ఉంటాయి. 

జూలై 1వ తేదీన ఫైర్‌ సైడ్‌ ఛాట్‌ (ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌) పేరుతో ఓ కార్యక్రమం జరగనున్నది. వాసు బైరెడ్డి కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. సభ్యులుగా హరి కంచర్ల, లక్ష్మీదరూరు ఉన్నారు. స్టార్టప్‌ నెక్ట్స్‌ పేరుతో నెక్స్ట్‌ జనరేషన్‌ కంపెనీస్‌ అంశంపై ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జూన్‌ 1వ తేదీన జరిగే ఈకార్యక్రమానికి అరవింద్‌ నేరెళ్ళ (కో ఆర్డినేటర్‌), దేవీ అనుపల్లి టీమ్‌గా ఉన్నారు. జూలై 2వ తేదీన ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ ఇబి 5 అంశంపై కార్యక్రమం జరగనున్నది. ఇమ్మిగ్రేషన్‌ అటార్నీలతో జరిగే ఈ సమావేశానికి లింగా రెడ్డి కో ఆర్డినేటర్‌గా ఉన్నారు. సుధీర్‌ మేడపాటి టీమ్‌లో ఉన్నారు. విసి ప్యానల్‌ (ఇన్వెస్ట్‌మెంట్‌ డైవర్సిఫికేషన్‌ పేరుతో ఓ కార్యక్రమం జరగనున్నది. వీసి, ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వయిజర్స్‌ ఇందులో మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమానికి మురళీ నర్తినిని కో ఆర్డినేటర్‌, గౌతం మియాపురం, వంశీ చాద సభ్యులుగా ఉన్నారు.

 

 

Tags :