ఈసారి గెలవాల్సిందే: రో ఖన్నా
అమెరికాలో ఇప్పుడు రాజకీయ తెరపై వెలుగొందుతున్న ప్రవాస భారతీయుల్లో రో ఖన్నా కూడా ఒకరు కాలిఫోర్నియాలోని 17వ కాంగ్రెసెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి మరోసారి రో ఖన్నా పోటీ చేస్తున్నారు. ఈసారి తాను ఖచ్చితంగా గెలవాలన్న పట్టుదలతో ఆయన పనిచేస్తున్నారు. అధ్యక్షుడు ఒబామా ప్రభుత్వంలో అత్యున్నతమైన పదవిని చేపట్టడంతోపాటు ఒబామా రీ ఎలక్షన్ కమిటీల్లో పనిచేసి తన రాజకీయ ప్రవేశానికి గట్టి పునాదులనే ఏర్పాటు చేసుకున్నారు. ఈసారి తాను ఖచ్చితంగా గెలిచేందుకు అవసరమైన కార్యాచరణను ఆయన చేస్తున్నారు. అమెరికన్ల గట్టి మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. రో ఖన్నా పోటీ చేసే ప్రాంతంలో ఎక్కువమంది తెలుగువాళ్ళు నివసిస్తున్నారు. సిలికాన్‌వ్యాలీలో ఉన్న తెలుగువాళ్ళు గట్టిగా మద్దతు ఇస్తే రో ఖన్నా గెలుపు ఖాయమని చెబుతారు. రో ఖన్నా కూడా మొదటి నుంచి తెలుగువాళ్ళతో సన్నిహితంగానే ఉంటున్నారు. తెలుగువాళ్ళ?వేడుకలకు, స్థానిక తెలుగు సంఘాల కార్యక్రమాలకు కూడా ఆయన హాజరవుతున్నారు. తెలుగు కమ్యూనిటీ ప్రముఖులందరితోనూ ఆయనకు పరిచయం ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి జరిగే ఎన్నికల్లో తెలుగువాళ్ళంతా గట్టిగా ముందుకు వచ్చి తనకు ఓటు వేయాలని ఆయన కోరుతున్నారు. న్యాయవాది అయిన రో ఖన్నా గత ఎన్నికల్లో తన ప్రత్యర్థి మైక్‌హోండా చేతిలో కేవలం 3.6శాతం ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి మాత్రం గెలవాలని పట్టుదలతో ఉన్నారు.