హైదరాబాద్‌లో డిజిటెక్ సెంటర్ ఏర్పాటు చేయనున్న 'కాల్ అవే' గోల్ఫ్ కంపెనీ
ప్రపంచ ప్రఖ్యాతి పొందిన కాల్‌అవే గోల్ఫ్ కంపెనీ హైదరాబాద్‌లో డిజిటెక్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్‌తో ఆ కంపెనీ ప్రముఖులు ఈ విషయమై చర్చలు జరిపారు. అనంతరం ఈ ప్రకటనను విడుదల చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటుచేయనున్న డిజిటెక్ సెంటర్‌లో 300 మంది సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్‌కు ఉపాధి లభించనుంది. ఈ కేంద్రం డేటా అనలిటిక్స్‌తోపాటు ఆ కంపెనీ గ్లోబల్ ఆపరేషన్స్‌కు ఐటీ బ్యాకెండ్ సపోర్ట్‌ను అందించనుంది. కాగా, ఈ సమావేశంలో తెలంగాణలో స్పోర్ట్స్ టూరిజం, తయారీలాంటి ఇతర సహకార అవకాశాలపై చర్చించారు. డిజిటెక్ సెంటర్ ఏర్పాటుకోసం దేశంలోని వివిధ నగరాలను పరిశీలించిన కాల్‌అవే కంపెనీ, చివరగా హైదరాబాద్‌ను ఎంచుకోవడం విశేషం.
Tags :