ASBL Koncept Ambience

తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం

తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం

తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మైకులు మూగబోయాయి. ప్రచార గడువు ఈ సాయంత్రం 5 గంటలతో ముగిసింది. సాయంత్రం 5 గంటల తర్వాత బహిరంగ సభల నిర్వహణపై నిషేధం విధించారు. సభలు, ఊరేగింపులు, సినిమా, టీవీల ద్వారా ప్రచారంపై ఆంక్షలు పెట్టారు. ఇక పోలింగ్‌ తరువాయి. ఈ నెల 7న 119 నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్‌ నిర్వహణ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఈ ఎన్నికల బరిలో మొత్తం 1821 మంది అభ్యర్థులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 32,815 పోలింగ్‌ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. అత్యధికంగా హైదరాబాద్‌లో 3873, వనపర్తిలో 280 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల కోసం 1,60,509 మంది సిబ్బందిని కేటాయించారు. ఎన్నికల కోసం 55,329 బ్యాలెట్‌ యూనిట్లు, 42,751 వీవీప్యాట్‌ యంత్రాలు, 39,763 కంట్రోల్‌ యూనిట్లను వినియోగించనున్నారు. ఎన్నికల విధుల్లో 649 మంది సహాయక రిటర్నింగ్‌ అధికారులు ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,80,64,684 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 11న వెల్లడికానున్నాయి.

 

Tags :