కేర్ హాస్పిటల్స్
సామాన్యునికి కూడా మెరుగైన వైద్యం అందించాలన్న సదుద్దేశ్యంతో కేర్ ఆసుపత్రి ఏర్పాటైంది. 1997లో డాక్టర్ బి. సోమరాజు ఆధ్వర్యంలోని టీమ్ కేర్ హాస్పిటల్‌ను ప్రారంభించింది. కేర్ హాస్పిటల్‌కు చైర్మన్‌గా సోమరాజు వ్యవహరిస్తూ తక్కువ ధరలకు, నాణ్యమైన, సురక్షితమైన వైద్యసేవలను అందించేలా ఆయన కేర్ హాస్పిటల్‌ను తీర్చిదిద్దుతున్నారు. గుండె, సోమరాజు, కేర్ ఆసుపత్రి ఈ మూడుపదాలకు అవినాభావ సంబంధం ఏర్పడిరదంటే సోమరాజు అంటే ఏమిటో అర్థమవుతుంది.మెడిసిన్‌పట్ల ఆయనకు ఉన్న అంకితభావం, పేషంట్లపై మమకారంతో ‘కేర్’ను ఆయన అందరికీ దగ్గరిగా ఉంచేలా చేశారు. దాదాపు 13 ఆసుపత్రులతో 7 నగరాల్లో దేశంలోని ఐదు రాష్ట్రాల్లో రోగులకు కేర్ సేవలను అందిస్తోంది. దాదాపు 30 విభాగాల్లో కేర్ ఆసుపత్రి సూపర్ స్పెషాల్టీ వైద్యాన్ని అందిస్తోంది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ ఆజాద్, డా. సోమరాజు కలిసి గుండెరోగులకోసం కలామ్`రాజు పేరుతో స్టెంట్‌ను ఉత్పత్తి చేసి అతి తక్కువ ధరలతో గుండె రోగికి ఉపశమనం కలిగేలా చేశారు.
కేర్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి మెడికల్ విభాగంలో రీసెర్చ్, స్పెషలైజ్‌డ్ ఎడ్యుకేషన్, మెడికల్ ప్రొడక్ట్స్, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బలహీనవర్గాలకు ఆరోగ్య చికిత్సను ఈ ఫౌండేషన్ ద్వారా అందజేస్తున్నారు. కేర్ ట్రస్ట్, కార్డియోవాస్కులర్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ కలిసి ఈ విధమైన చికిత్సను అందజేస్తున్నాయి.లిటిల్ హార్ట్స్ ప్రాజెక్టు, కేర్ రిలీఫ్ ఫండ్, కిడ్నీ కేర్ ప్రాజెక్టు, క్లినికల్ రీసెర్చ్, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, కేర్ రూరల్ హెల్త్ మిషన్ వంటి పనులను కేర్ ఫౌండేషన్ నిర్వహిస్తోంది.
1997లో నాంపల్లి వద్ద మొదటి కేర్ హాస్పిటల్‌ను ఏర్పాటు చేశారు. మొదట్లో కేర్ హాస్పిటల్‌ను గుండె చికిత్సకు ప్రధానమైన కేంద్రంగా పరిగణించేవారు. కాని నేడు అన్నీ రోగాలకు మెరుగైన చికిత్సను అందించేలా కేర్ నేడు విస్తరించి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌గా కేర్ హాస్పిటల్స్ అవతరించింది. ఈ ఆసుపత్రిలో ఓ విశేషం కనిపిస్తుంది. ప్రతి స్పెషాలిటీ శాఖను నిపుణులైన డాక్టర్లు నిర్వహిస్తుంటారు. వైద్యరంగంలో వస్తున్న మార్పులను, అధు నాతన యంత్రాలను ఈ హాస్పిటల్‌లో ఏర్పాటు చేశారు. కేర్ ఆసుపత్రిలో వైద్యులంతా ఓ టీమ్‌లాగా వైద్యం చేయడం ఇక్కడి ప్రత్యేకత. రోగిని ఎక్కువ మంది డాక్టర్లు చూడటం వల్ల సెకండ్ ఒపినియన్స్ తెలుసుకునే అవకాశం ఏర్పడిరది.రోబోటిక్ సర్జరీని కూడా ‘కేర్’ హాస్పిటల్ తొలిసారిగా ఇక్కడ పరిచయం చేసింది. డిఆర్‌డివో భాగస్వామ్యంతో డాక్టర్ సోమరాజు స్టెంట్‌ను అభివృద్ధి చేయడం, పూర్తి స్వదేశీ నైపుణ్యంతో ఈ కథటర్ వల్ల బైపాస్ సర్జరీ ఖర్చు ఎంతో తగ్గింది.
www.carehospitals.com |
|
CARE Hospitals |
CARE Hospitals |
Guru Nanak CARE Hospitals |
CARE Hospitals |
CARE Outpatient Centre |
For Emergency Call: 105711 For Appointments Call (Toll Free): 1800 108 6666 Timings: 6AM to 10PM |