వైభవంగా సాగిన ‘కాట్స్’ ఉగాది వేడుకలు
రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం ‘కాట్స్’ వారు శుభకృత్ నామ ఉగాది వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎంతోమంది ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించేలా సాగాయి. 200 మందికి పైగా కళాకారులతో 6 గంటల పాటు నిర్విరామంగా జరిగిన ఈ వేడుకల్లో టాలీవుడ్ గాయని సుమంగళి పాడిన పాటలు హైలైట్స్‌గా నిలిచాయి. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే వేషధారణలతో కళాకారులు ప్రదర్శించిన కార్యక్రమాలు ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో ఆకట్టుకున్నాయి. తెలుగు ఆధారిత సాంప్రదాయ వస్త్రాలంకరణ (ఫ్యాషన్ షో), టాలీవుడ్, బాలీవుడ్ డాన్స్‌లు మరియు వేదిక అలంకరణ, ఆడియో విజువల్స్ మొదలైన ఎన్నో కార్యక్రమాలతో సంబరాలు అంబరాన్నంటాయి.
ఈ కార్యక్రమం కాట్స్ అధ్యక్షులు సతీష్ వడ్డీ అధ్యక్షతన, ఉపాధ్యక్షులు రామ యెరబండి, జనరల్ సెక్రటరీ పార్థ బైరెడ్డి, కమ్యూనిటీ అఫైర్స్ చైర్ కౌశిక్ సామ, కృష్ణ కిషోర్, రంగ సూరా ప్రారంభించగా, కల్చరల్ చైర్ విజయ దొండేటి, కల్చరల్ కోచైర్స్ హరిత, సుప్రజ, గీత, సత్య, జ్యోతి, నవ్య, లావణ్య, అవని, జయశ్రీ, గార్లతో కలిసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. కోశాధికారి రమణ, విష్ణు, అమర్ పాశ్య, ప్రద్యుమ్న మరియు తేజ పర్యవేక్షణలో నిర్వహించిన చెస్ పోటీలలో గెలుపొందినవారందరికి కాట్స్ ట్రోఫీలు మెడల్స్ ను ఫౌండర్స్ రామ్ మోహన్ కొండా, ఆటా అధ్యక్షులు భువనేష్ బుజాల, జయంత్ చల్లా చేత అందజేశారు. ఈ కార్యక్రమాలన్ని కాట్స్ సీనియర్ కార్యవర్గం ఫౌండర్స్ రామ్ మోహన్ కొండా, చిత్తరంజన్ నల్లు, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ భాస్కర్ బొమ్మారెడ్డి, మధుసూదన్ రెడ్డి కోలా, అనిల్ రెడ్డి నందికొండ, సుధారాణి కొండపు మరియు అడ్వైజర్స్ రవి బొజ్జ, వెంకట్ కొండపోలు, ప్రవీణ్ కాటంగూరి, గోపాల్ నున్న, రీజినల్ ఉపాధ్యక్షులు హరీష్ కొండమడుగు, రవి గణపురం గారు మరియు ఇతర కాట్స్ కార్యవర్గం ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిసాయి.
జులై 1, 2, 3 తేదీలలో అమెరికన్ తెలుగు సంఘము ‘ఆటా’ నిర్వహించే 17వ మహాసభలకు కోహోస్టుగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని కాట్స్ కార్యవర్గం ఈ సందర్భంగా తెలియజేసింది. ఈ వేడుకలకి ఆటా ప్రెసిడెంట్ భువనేష్ బుజాల, కన్వీనర్ సుధీర్ బండారు, శ్రవణ్ పాడూరు, రవి చల్ల, పవన్, అమర్ బొజ్జ, హనిమి రెడ్డి, లోహిత్ రెడ్డి అల్లూరి, మరియు ఇతర సభ్యులు హాజరయ్యారు. టీడీఫ్ నుంచి విశ్వేశర కలవల, కవిత చల్ల, నాటా నుంచి ఆంజనేయ దొండేటి, మధు మోటాటి, బాబూరావ్ శ్యామల, సురేష్ కొత్తింటి, సత్య పాటిల్, సతీష్ నరాల మరియు ఆప్త నుంచి కిరణ్ చందు, శ్రీని సిద్దినేని, రాజేష్ అంకమ్ హాజరయ్యారు.