ఏపీతో కలిసి అడుగులు వేసేందుకు గూగుల్ ఎక్స్ సంసిద్ధత
గూగుల్ డ్రైవర్ లెస్ కారు, గూగుల్ గ్లాసెస్ తదితర ఆవిష్కరణలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన గూగుల్ ఎక్స్ ఏపీతో కలిసి అడుగులు వేసేందుకు అంగీకరించింది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని అమెరికా పర్యటనలో ఉన్న సీఎం బృందం శుక్రవారం సందర్శించింది. ఎన్నో గూగుల్ ఆవిష్కరణలకు కేంద్రమైన ఈ ప్రదేశం అత్యంత గోప్యమైంది. ఇక్కడికి చాలా తక్కువమందికే అనుమతి ఉంటుంది. గూగుల్ ఎక్స్ సీఈవో అస్ట్రో టెల్లర్ తమ ఆవిష్కరణలు, పరిశోధనలపై సీఎంకు ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ తరహా ఆవిష్కరణలకు, వినూత్న ప్రయోగాలకు ఏపీని వేదికగా మలచుకోవచ్చని సీఎం సూచించారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు గూగుల్ ఎక్స్ అంగీకరించింది. ముఖ్యంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ వ్యాప్తికి సహకారం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.
Tags :