ASBL Koncept Ambience

భవిష్యత్తు అంతా జ్ఞానానిదే

భవిష్యత్తు అంతా జ్ఞానానిదే

మనకు పూర్వీకులు ఇచ్చిన భౌతిక సంపదను వారసత్వంగా భావించకూడదని, జ్ఞానమే అసలైన సంపదని, భవిష్యత్తు అంతా జ్ఞానానిదేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం దావోస్‌లో జరిగిన 'ఇంటరాక్టివ్‌ లంచాన్‌ విత్‌ టాప్‌ ఇన్నోవేటర్స్‌ ఇన్‌ టెక్‌' అనే కార్యక్రమంలో 'టెక్నాలజీస్‌ ఫర్‌ టుమారో' అంశంపై ముఖ్యమంత్రి ప్రసంగించారు. జ్ఞాన సంపదతో రాత్రికి రాత్రే అద్భుతాలు చేయవచ్చన్నారు. నవ్యఆవిష్కరణలు మన జీవన విధానాన్నే మార్చివేస్తున్నాయని, ప్రస్తుతం మనం నాలుగో పారిశ్రామిక విప్లవకాలంలో ఉన్నామని చెప్పారు.

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ (వ్యాపార అనుకూల వాతావరణం) గురించి మాట్లాడుతున్న మనం, మరో అడుగు ముందుకువేయాలని ముఖ్యమంత్రి పిలుపిచ్చారు. ఇప్పడు కల్పించాల్సింది సంతప్తిగా జీవించే అనుకూల వాతావరణం (ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ విత్‌ హ్యాపీనెస్‌) అని చెప్పారు.  విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ఇప్పుడు సరికొత్త రాష్ట్రంగా అవతరించిందని, అభివద్ధిలో మాకు స్పష్టమైన లక్ష్యాలున్నాయని చెప్పారు. 2022 నాటికి దేశంలోని మూడు అత్యుత్తమ రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 కల్లా దేశంలోనే నెంబర్‌వన్‌ రాష్ట్రంగా, 2050కి ప్రపంచ పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతామని మన విజన్‌ గురించి ముఖ్యమంత్రి వివరించారు.

ప్రాధాన్యతారంగాలను ఏడు మిషన్లుగా విభజించి తాము దార్శనికపత్రం రూపొందించుకున్నామని, ఐదు గ్రిడ్లు, ఐదు ప్రచార ఉద్యమాలు తీసుకుని ప్రగతికి దిశ నిర్దేశించుకున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌, ఇ-ప్రగతి, ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌లపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ప్రతి ఇంటినీ ఫైబర్‌ గ్రిడ్‌తో అనుసంధానం చేశామని, ప్రస్తుతం మేం ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో కానారేెన్స్‌ నెట్‌వర్క్‌ వున్న రాష్ట్రంగా అవతరించామని ముఖ్యమంత్రి అన్నారు. కేవలం నెలకు రెండు డాలర్ల ఖర్చుతో టెలిఫోన్‌, టెలివిజన్‌, వైఫై సదుపాయాలను కల్పిస్తున్నామని వెల్లడించారు.

రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ గురించి సవివరంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సంబంధించి సమాచారం సేకరించి, సంక్షేమ పథకాల ఫలాలు పారదర్శకంగా ప్రతి ఒక్కరికి చేరేలా క షి చేస్తున్నామని అన్నారు. 'భూదార్‌' ద్వారా భూమికి సంబంధించి సమాచారం మొత్తం ఒకచోట చేర్చామని, సమగ్ర ఆర్ధిక నిర్వహణ వ్యవస్థ ఏర్పాటు చేశామని తెలిపారు. ఇ-ఆఫీసు, ఇ-కేబినెట్‌, క్లౌడ్‌, బయోమెట్రిక్‌, గాలి స్వఛతేను కొలిచే సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నామని చెప్పారు. వీధి దీపాలను సెన్సర్ల ద్వారా నిర్వహిస్తున్నామని, అన్ని పాఠశాలల్లో వర్చువల్‌ క్లాస్‌ రూములు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వివిధ అవసరాలకు డ్రోన్లను పెద్దఎత్తున ఉపయోగిస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. 'లాక్డ్‌ హౌస్‌ మేనేజ్‌ మెంట్‌' వ్యవస్థ తీసుకొచ్చి దొంగతనాలు జరుగకుండా ప్రతి ఇంటికి భద్రత కల్పిస్తున్నామని వివరించారు.

Click here for Photogallery

 

Tags :