ఆటాలో తెలుగు టైమ్స్...పత్రికను తిలకిస్తున్న ప్రముఖులు
అమెరికా తెలుగు సంఘం (ఆటా) వాషింగ్టన్ డీసీలో నిర్వహిస్తున్న 17వ మహాసభలను పురస్కరించుకుని ‘తెలుగు టైమ్స్’ వెలువరించిన ప్రత్యేక సంచికను ఆటా వేడుకలకు వచ్చిన పలువురు ఆసక్తిగా తిలకించడం జరిగింది. ఎన్నారైల మానస పత్రికగా, తెలుగు అసోసియేషన్ ల కరపత్రికగా గత 19 సంవత్సరాల నుంచి అమెరికాలో నిరంతరాయంగా ప్రచురితమవుతున్న ‘తెలుగుటైమ్స్’ అందరికీ ఎంతో అభిమాన పత్రిక. తెలుగు అసోసియేషన్‌ల మహాసభల సమయంలో ప్రత్యేక సంచికను గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు టైమ్స్ ప్రచురిస్తోంది. అలాగే ఆటా మహాసభలను పురస్కరించుకుని ప్రచురించిన ప్రత్యేక సంచికను పలువురు ప్రముఖులు విశేషంగా తిలకించారు. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిటిఎ) వ్యవస్థాపకుడు డా. పైళ్ల మల్లారెడ్డి, హరనాథ్ పులిచెర్ల, ఆటా వ్యవస్థాపకుల్లో ఒకరైన హనుమంత రెడ్డి, విజయసాయిరెడ్జి, జిఎంఆర్ అధినేత గ్రంథి మల్లిఖార్జునరావు తదితరులు తెలుగు టైమ్స్ పత్రికను ఆసక్తిగా తిలకించారు.