ASBL Koncept Ambience

చంద్రబాబు విజయంతో పోలండ్ లో.. సంబరాలు

చంద్రబాబు విజయంతో పోలండ్ లో.. సంబరాలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వైసీపీని చిత్తుగా ఓడిరచింది. ఈ క్రమంలో పోలండ్‌లో చంద్రబాబు ఫాలోవర్లు, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్తలైన కాట్రగడ్డ చందు, విజయ్‌, ఐటీ నిపుణులైన రామ సతీష్‌ వారి ఆధ్వర్యంలో సంబరాలు అంబరాన్నంటాయి. వీరంతా కలిసి చంద్రబాబు విజయాన్ని అక్కడ బాణసంచా వెలిగించి, స్వీట్స్‌ పంచుకుని ఘనంగా సెలబ్రెట్‌ చేసుకున్నారు. కాట్రగడ్డ చందు, విజయ్‌ 200 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించి అలాగే ఎంతోమంది తెలుగు వారికి పోలాండ్‌ లో సహాయ సకారాలు అందిస్తున్నారు. రామ సతీష్‌ వంటి వారు పోలాండ్‌లో మన తెలుగు వారి కోసం అండగా నిలిచి, తెలుగుదేశం పార్టీ కోసం కొంత కాలంగా చురుకుగా పని చేస్తున్నారు.  ఈ విజయోత్సవ కార్యక్రమంలో నిపుణులు రామ్మోహన్‌, కిరణ్‌, సచిన్‌, ప్రవీణ్‌, పవన్‌, సందీప్‌, రామనాయుడు, సురేష్‌, మోహన్‌, మహేష్‌, వినయ్‌, మౌర్య, శైలేంద్ర, నీల, విశాల్‌, మల్లి, కిరణ్‌, ఆజాద్‌, అభిలాష్‌ పాల్గొన్నారు.

 

 

Tags :