నాట్స్ బాంక్వెట్ డిన్నర్ లో ప్రముఖులు
ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) 7వ అమెరికా తెలుగు సంబరాల తొలిరోజు బాంక్వెట్ విందుకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, సినీ ప్రముఖులు సాయికుమార్, కోదండరామిరెడ్డి. బి.గోపాల్, ఆలీ, మెలోడీ బ్రహ్మ మణిశర్మ, ప్రముఖ దర్శకులు బీవీఎస్ రవి, సినీ దర్శకులు గోపిచంద్ మలినేని, బిగ్ బాస్ ఆర్టిస్టులు హిమజ, శివజ్యోతి పాల్గొన్నవారిలో ఉన్నారు. అలాగే జోర్ధార్ సుజాత, జబర్థస్త్ రాకేశ్, ముక్కు అవినాశ్, ప్రముఖ నటులు కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి, నందమూరి సుహాసిని, సత్య మాస్టర్, ప్రముఖ నటులు కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి, నందమూరి సుహాసినిలతోపాటు ఇంకా పలువురు నటీనటులు కూడా పాల్గొన్నారు. తానా, ఆటా, మాటా, నాటా తదితర ప్రవాస తెలుగు సంఘల ప్రతినిధులు పాల్గొని తమ సందేశాన్ని వినిపించారు.
నాట్స్ సంబరాల కన్వీనర్ శ్రీధర్ అప్పసాని, అధ్యక్షులు బాపయ్య చౌదరి (బాపు) నూతి మరియు ఛైర్మన్ అరుణ గంటి లతోపాటు నాట్స్ సంబరాల కమిటీల ప్రతినిధులంతా ఈ కార్యక్రమాల విజయవంతానికి ప్రత్యేకంగా కృషి చేశారు. ఇతర జాతీయ మరియు స్థానిక తెలుగు సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.