టిటిఎ పండుగ....సీటెల్‌కు తరలివచ్చిన ప్రముఖులు
తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టిటిఎ) మెగా కన్వెన్షన్‌కు అంతా సిద్ధమైంది. మూడురోజులపాటు జరిగే పండుగకు సియాటెల్ నగరం ముస్తాబైంది. మే 24 నుంచి 26వ తేదీ వరకు జరిగే ఈ మెగా కన్వెన్షన్ కోసం పలువురు ప్రముఖులు తరలివచ్చారు. ఇప్పటికే టిటిఎ ప్రముఖులంతా కన్వెన్షన్ హాల్ కు చేరుకున్నారు. వచ్చిన అతిధులకు స్వాగత ఏర్పాట్లను, వసతి సౌకర్యాలను కల్పించారు. ఈ మెగా కన్వెన్షన్‌కోసం ఆరు నెలల క్రితం నుంచే టిటిఎ నాయకులు తగిన ప్రణాళికలతో, కమిటీల ఏర్పాటుతో రంగాన్ని సిద్ధం చేస్తూ వచ్చారు. టిటిఎ ఫౌండర్ పైళ్ళ మల్లారెడ్డి ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ వంశీ రెడ్డి కంచరకుంట్ల నాయకత్వంలో వివిధ కమిటీలు అన్నీ ఏర్పాట్లను పూర్తి చేశాయి. వచ్చిన అతిధులకు విమానాశ్రయంలో టీటిఎ నాయకులు స్వాగతం పలికారు. సింగర్ శ్రీకృష్ణ, హీరోయిన్ శ్రీలీల, ఇతర సింగర్లు, ఆటా ప్రెసిడెంట్ మధు బొమ్మినేని, మాజీ ప్రెసిడెంట్ భువనేష్ బూజాల తదితరులు ఇప్పటికే తరలివచ్చారు. వారికి విమానాశ్రయంలో టీటిఎ నాయకులు స్వాగతం పలికారు.