తానా మహాసభలకు వస్తున్న ప్రముఖులు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 7,8,9 తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఈ మహాసభల్లో పాల్గొనేందుకోసం పలువురు ప్రముఖులు తరలి వస్తున్నారు. ముఖ్య అతిధులుగా నందమూరి బాలకృష్ణ, ఎం. వెంకయ్యనాయుడు, జస్టిస్ ఎన్.వి. రమణ తదితరులు హాజరవుతున్నారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, ఎంపిలు కనకమేడల రవీంద్ర, దర్శకుడు కె. రాఘవేంద్రరావు, నటుడు నిఖిల్ సిద్దార్థ, హీరోయిన్ శ్రీలీల, డిరపుల్ హయాతి, ఆనంది, భవ్యశ్రీ, అనసూయ భరద్వాజ్, విశ్వక్ సేన్, శ్రీకాంత్, నాగినీడు, అశోక్ కుమార్, సుహాస్, రఘుబాబు, రవి వర్మ, భరత్ రెడ్డి, సుధాకర్ కమకుల, డిఫెన్స్ అడ్వయిజర్ జి. సతీష్ రెడ్డి, ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌తోపాటు గాయనీ గాయకులు చిత్ర, ఎస్‌పిబి చరణ్, సునీత, శ్వేత మోహన్, కౌసల్య, సుమంగళి, హేమచంద్ర, గీతమాధురి, పృథ్వీ చంద్ర, సాగర్, రీట, మౌనిమ సిహెచ్, అనిరుధ్ సుస్వరం, ఇంద్రావతి చౌహాన్ తదితరులు ఈ మహాసభలకు వస్తున్నారు. దర్శకులు, నిర్మాతలు కూడా వస్తున్నారు. దిల్‌రాజు, టి.జి. విశ్వప్రసాద్, అనిల్ రావిపూడి, నవీన్ ఎర్నేని తదితరులు వస్తున్నారు.