ASBL Koncept Ambience

కిషన్ రెడ్డి, భట్టిలకు ఆటా గ్రాండ్ ఫినాలేకు ఆహ్వానం

కిషన్ రెడ్డి, భట్టిలకు ఆటా గ్రాండ్ ఫినాలేకు ఆహ్వానం

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, రాష్ట్ర మంత్రులను, ప్రజా ప్రతినిధులను గ్రాండ్‌ ఫినాలేకు ఆటా ప్రతినిధులను ఆటా వేడుకల చైర్‌పర్సన్‌ ఎలెక్ట్‌ ప్రెసిడెంట్‌ జయంత్‌ చల్లా ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం కలిసి ఆటా గ్రాండ్‌ ఫినాలేకు ఆహ్వానించారు. ఈ నెల 30న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించనున్న ఆటా సేవా కార్యక్రమాలను ఆటా ప్రతినిధులు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌, ఎంఎల్‌ఏ రాజాసింగ్‌లను కూడా ఆహ్వానించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటా సెక్రెటరీ రామకృష్ణ రెడ్డి అల, ట్రెజరర్‌ సతీష్‌ రెడ్డి, జాయింట్‌ ట్రెజరర్‌ రవీందర్‌ గూడూరు, 18వ ఆటా కాన్ఫరెన్స్‌ కన్వీనర్‌ కిరణ్‌ రెడ్డి పాశం, కన్వీనర్‌ సాయి సూధిని, బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ కాశీ కొత్త తదితరులు ఉన్నారు.

 

 

Tags :