పూర్ణకుంభంతో కేంద్రమంత్రులకు స్వాగతం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అయుత చండీయాగానికి హాజరైన కేంద్ర మంత్రులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, దత్తాత్రేయను కేసీఆర్ దంపతులు సాదరణంగా ఆహ్వానించిగా పండితులతో కలిపి పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ కుటుంబ సమేతంగా యాగానికి హాజరయ్యారు. తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ కూడా యాగాశాలకు వచ్చారు.
యాగానికి భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో ఎరర్రవల్లిలో యాగశాలలున్న పరిసరాలు భక్తులతో కళకళలాడింది.
యాగానికి హాజరైన ప్రముఖులు
మెదక్ జిల్లా ఎర్రవల్లిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న అయుత మహా చండీయాగానికి రెండోరోజు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కేంద్రమంత్రులు ఎం. వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, తెలంగాణ రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హరీశ్‌రావు, డీజీపీ అనురాగ్‌శర్మ, ఎంపీలు కవిత, కేశవరావు, జితేందర్‌రెడ్డి, శృంగేరి భావి పీఠాథిపతి విదుశేఖర భారతీ మహాస్వామి తండ్రి కుప్పా శివసుబ్రమణ్యం, తాత కుప్పా రామగోపాల వాజ్‌పేయీ యాజీ యాగంలో పాల్గొన్నారు. యాగకర్త అయిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు స్వామీజీలు ఆశీస్సులు అందజేశారు.