ASBL Koncept Ambience

అమెరికాలో ముగిసిన ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన

అమెరికాలో ముగిసిన ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన

అమెరికా పర్యటన  సమాచారాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ట్విటర్‌లో పంచుకున్నారు. ఏడు రోజులపాటు సాగిన తన పర్యటన ముగుస్తున్న తరుణంలో తానెక్కడెక్కడికి వెళ్లానన్న విషయాలతో పాటు ఎంతమందిని కలిశానన్న అంశాలను కూడా అందులో పేర్కొన్నారు. అమెరికాలో మొత్తం 7వేల కిలోమీటర్లకు పైగా తాను ప్రయాణించానని... 15 నగరాల్లో తిరిగి పారిశ్రామిక వేత్తలను కలుసుకున్నానని ఆయన ట్వీట్‌ చేశారు. 30కి పైగా సమావేశాలు నిర్వహించి పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నం చేసినట్లు తెలిపారు.

ఈ సమావేశాల ద్వారా వివిధ కంపెనీలకు చెందిన 90మంది సీఈఓలు, అధిపతులను కూడా కలుసుకున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయం, ఫైనాన్షియల్‌ టెక్నాలజీ కంపెనీలు, ఎడ్యుకేషన్‌, హార్డ్‌వేర్‌, ఐటీ, ఐఓటీ, వాహన, ఆరోగ్య రంగాలకు సంబంధించిన పరిశ్రమల్లో పెట్టుబడులు వచ్చే అవకాశముందని సీఎం వివరించారు. ఈ పరిశ్రమలు రాష్ట్రంలో ఏర్పాటైతే 12,500 పైచిలుకు ప్రత్యక్ష ఉద్యోగాలు వస్తాయని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.

Tags :