ASBL Koncept Ambience

సర్వేపల్లి రోడ్‌షోలో చంద్రబాబు ఏమన్నారంటే..

సర్వేపల్లి రోడ్‌షోలో చంద్రబాబు ఏమన్నారంటే..

నెల్లూరు: సీఎం చంద్రబాబు సర్వేపల్లిలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘విభజన తర్వాత మనం ఎన్నో కష్టాలు పడ్డాం. తెలంగాణలో అవమానించారు.. కట్టుబట్టలతో వచ్చాం. సచివాలయం లేదు.. కూర్చోవడానికి కనీసం కూర్చోలేదు. మన డబ్బులు కొట్టేశారు. 60 సంవత్సరాల శ్రమ దోచుకున్నారు. తెలుగు జాతి కోసం హైదరాబాద్‌ను అభివృద్ధి చేశా. ప్రపంచమంతా కాలినడకన తిరిగా. మోదీ రాజమండ్రికి వచ్చి పోలవరం పనులు జరగడం లేదంటున్నారు. గుడ్డి నరేంద్ర మోదీ నటిస్తున్నాడు. నీ నాటకాలు మా దగ్గర సాగవని హెచ్చరిస్తున్నాం. నీకు సిగ్గుంటే డబ్బులు ఇచ్చి ఉండాల్సింది . 7 వేల కోట్లు ఇచ్చి నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు. పోలవరం చట్టంలోనే ఉంది.. మీ దయాదాక్షిణ్యాలు అక్కర్లేదు. మీరిచ్చిన 7 వేల కోట్లు ఏ మూలకు సరిపోవు. జులైకి గ్రావిటీతో నీరిస్తాం. ఈ సంవత్సరంలోనే పోలవరం పూర్తి చేస్తాం. పట్టిసీమ పూర్తి చేసి 48.5 టీఎంసీల నీటిని తీసుకొచ్చాం. గోదావరి, పెన్నా నదుల అనుసంధానం చేస్తున్నాం. మోదీ.. మీరా నీతులుచెప్పేది. మీ దగ్గర పరిపాలన నేర్చుకోవాలా. మీరు పెద్ద మాటకారి..పనిమాత్రం ఉండదు. హూందాతనం లేని వ్యక్తి మోదీ. 140 నదులను అనుసంధానం చేస్తాం..నీటి ఎద్దడి ఉండదు. కృష్ణపట్నం పోర్టుతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. ఇచ్చాపురం- తడ వరకు బీచ్ రోడ్దు వేస్తాం. నేషనల్‌హైవేను బీచ్‌రోడ్‌కు కలుపుతాం.’’ అని అన్నారు.

 
Tags :