ASBL Koncept Ambience

ఏపీని తెలంగాణకు మించిన రాష్ట్రంగా చేస్తా : చంద్రబాబు

ఏపీని తెలంగాణకు మించిన రాష్ట్రంగా చేస్తా : చంద్రబాబు

కట్టుబట్టలతో బయటకు గెంటేశారు. ఇప్పుడు జగన్‌ ముసుగులో మరోసారి మన రాష్ట్రంపై దాడి చేయడానికి కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారు. ఇది ఆంధ్రులపై జరుగుతున్న దాడి. మన ఆత్మాభిమానంపై దాడి. కేసీఆర్‌, జగన్‌లు మన రాష్ట్రాన్ని తెలంగాణ బానిసగా మార్చడానికి కుట్రపన్నుతున్నారు. వైసీపీకి ఓటు వేస్తే కేసీఆర్‌కు ఓటు వేసినట్టే అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ తమ హయాంలోనే అభివృద్ధి చెందిందని తెలిపారు. చిత్తూరు జిల్లా సత్యవేడు, నెల్లూరు జిల్లా వెంకటగిరి, సూళ్లూరు పేట, గూడూరు, ప్రకాశం జిల్లా సింగరాయకొండ, ఒంగోలు నియోజకవర్గాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ, తమిళనాడు సహా దేశంలో ఎక్కడా లేవన్నారు. 

ఈసారి ఎన్నికల్లో టీడీపీ పోటీ వైసీపీతో కాదని, టీఆర్‌ఎస్‌తోనే అని పునరుద్ఘాటించారు. తెలంగాణలోని ఉమ్మడి ఆస్తుల్లో ఏపీ వాటా లాక్కోవడంతోపాటు ఏపీకి వర్చిన పోర్టును కూడా తీసుకోవాలని కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నట్టు ఆరోపించారు. హైదరాబాద్‌లో ఉన్న మన సీమాంధ్ర పారిశ్రామికవేత్తలను రకరాలుగా బెదిరిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో 30 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ ఉంది. అందుకే అక్కడ పోటీ చేశాం. దానికి కేసీఆర్‌ కసి పెంచుకున్నాడు. నాకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తామని హెచ్చరించారు. నేను జీవించి ఉండగా తెలంగాణకు ఆంధ్రాను బానిస కానివ్వను అని తేల్చిచెప్పారు. ఇప్పుడు చెబుతున్నా ఏపీని తెలంగాణకు మించిన రాష్ట్రంగా చేస్తా. అమరావతిని అద్భుతంగా నిర్మిస్తా అని హామీ ఇచ్చారు.

 

Tags :