టీడీపీని మళ్లీ గెలిస్తే ప్రపంచం మొత్తాన్ని ఏపీకి తీసుకొస్తా
వైసీపీ నేరస్థుల పార్టీ అని, జగన్‌పై 31 కేసులున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. అందుకే ఆయన అధికారంలోకి వస్తే ఎవరూ పెట్టుబడులు కూడా పెట్టరని అన్నారు. టీడీపీని మళ్లీ గెలిపిస్తే ప్రపంచం మొత్తాన్ని ఏపీకి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లాలోని నంద్యాలలో జరిగిన ప్రచార సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఇప్పటికి వరకు రాష్ట్రానికి 15 లక్షల కోట్ల రూపాయలు వచ్చాయని, త్వరలో మూడు లక్షల మందికి ఉద్యోగాలు సైతం రాబోతున్నాయని ప్రకటించారు. నంద్యాల కేంద్రంగా పరిశ్రమలు తీసుకొస్తామని, యువతకు ఉద్యోగాలు వచ్చే వరకు విశ్రమించనని తెలిపారు. కేసీఆర్, జగన్ మోదీ చేతిలో ఉన్నారని, జగన్‌కు ఓటేస్తే మోదీకి ఓటు వేసినట్లేనని ఆయన తెలిపారు. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీని గెలిపించిన తీరును మరిచిపోనని, నంద్యాలను గుండెల్లో పెట్టుకుంటానని ప్రకటించారు. ఏపీకి ద్రోహం చేసిన మోదీని ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు.