ASBL Koncept Ambience

ముఖ్యమంత్రి చంద్రబాబుకు ‘ట్రాన్స్‌ఫర్మేటివ్ చీఫ్ మినిస్టర్‌’ అవార్డు ప్రదానం

ముఖ్యమంత్రి చంద్రబాబుకు ‘ట్రాన్స్‌ఫర్మేటివ్ చీఫ్ మినిస్టర్‌’ అవార్డు ప్రదానం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అమెరికాలో అరుదైన గౌరవం, గుర్తింపు లభించాయి. భారత్-యూఎస్ భాగస్వామ్యానికి రాష్ట్ర స్థాయిలో కృషి చేస్తున్నందుకు గాను 2017 సంవత్సరానికి యునైటెడ్ స్టేట్స్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ (USIBC) చంద్రబాబు నాయుడును ‘ట్రాన్స్‌ఫర్మేటివ్ చీఫ్ మినిస్టర్‌’గా ప్రకటించింది. యుఎస్ఐబీసీ రెండవ వార్షిక పశ్చిమ తీర సదస్సు వేదికపై ఈ అవార్డును సిస్కో సంస్థ వరల్డ్ వైడ్ హెడ్ జాన్ చాంబర్స్ చేతుల మీదుగా ముఖ్యమంత్రి అందుకున్నారు. ఈ పురస్కారం తనకు మాత్రమే కాదని, తన రాష్ట్రానికి దక్కిన గౌరవంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇది అమెరికన్ ఇన్వెస్టర్ల నుంచి తన రాష్ట్రానికి ఇస్తున్న మద్ధతుగా భావిస్తున్నానని అన్నారు. తన మిత్రుడు, శ్రేయోభిలాషి జాన్ చాంబర్స్ నుంచి అందుకోవడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. 

ఇక్కడున్న ప్రతి యూఎస్ పారిశ్రామికవేత్త ఏపీకి వచ్చి ఒక పరిశ్రమను స్థాపించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కోరారు. అనేక సంవత్సరాలుగా భారత్-యూఎస్ మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయని, పెట్టుబడులు పెట్టేందుకు భారత్‌లో అపార అవకాశాలు వున్నాయని చెప్పారు. భారత్‌లో, ఏపీలో పెట్టుబడులు ఎలా పెట్టాలన్నది ప్రస్తుతం మీ ముందున్న అంశమని, త్వరితగతిన వచ్చి మీ వ్యాపారాల్ని విస్తరించాల్సిందిగా సూచించారు. 

Tags :