ASBL Koncept Ambience

‘ఆపిల్’కు చంద్రబాబు ఆహ్వానం

‘ఆపిల్’కు  చంద్రబాబు ఆహ్వానం

సుస్థిర వృద్ధి ఫలితాలు సాధిస్తూ బలీయమైన దేశంగా ఎదుగుతున్న భారత్‌లో పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని విస్తృతం చేసుకోవాలని తనతో భేటీ అయిన ఆపిల్ సీవోవో జెఫ్ విలియమ్స్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానం పలికారు. భారతదేశంలో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ రాష్ట్రంగా పేర్కొన్నారు. వృద్ది, అభివృద్ధి అంశాల్లో సరైన భాగస్వామ్యం కోసం అన్వేషిస్తున్నామని, వ్యాపార దక్షత, సమర్ధత, అపారమైన తెలివితేటలు తమ ప్రజల సొంతమని చెప్పారు. ఏపీలో మంచి వనరుల నుంచి మానవ వనరుల వరకు అన్నీ పుష్కళంగా వున్నాయని వివరించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టి మాన్యుఫాక్ఛరింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ప్రపంచ దేశాలతో సరి చూసుకుంటే అత్యధిక సంఖ్యలో యువత భారతదేశంలోనే వుందని తెలిపారు. ముఖ్యమంత్రి బృందం అమెరికా పర్యటన రెండోరోజు ఈ భేటీ జరిగింది. 

Tags :