అమరావతి శంకుస్థాపనకు గవర్నర్ ను ఆహ్వానించిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి రావాలంటూ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. రాజ్‌భవన్‌కు వెళ్లిన చంద్రబాబు గవర్నర్‌కు శాలువా కప్పి, ఆహ్వానపత్రికను అందజేశారు. ఈ నెల 22న జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. గవర్నర్‌కు తిరుమల ప్రసాదాన్ని అందించారు. అనంతరం దాదాపు అరగంట సేవపు ఇద్దరి మధ్య సమావేశం జరిగింది. అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లు, ఇతర అంశాలపై ఆయన గవర్నర్‌కు వివరించారు. అమరావతికి తప్పక వస్తానని గవర్నర్ చంద్రబాబుకు తెలిపారు.
Tags :