ASBL Koncept Ambience

ఎబిబి అధ్యక్షునితో చంద్రబాబు భేటీ

ఎబిబి అధ్యక్షునితో చంద్రబాబు భేటీ

'రాష్ట్రంలో రెండో తరం విద్యుత్‌ రంగ సంస్కరణలు అమలుతో విద్యుత్‌ వినియోగం పెరిగినా చార్జీలు పెరగనివ్వలేదు. నాణ్యమైన, స్వఛమైేన విద్యుత్‌ కోసం సౌర, పవన విద్యుత్‌ ఉత్పత్తిని పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నాం. ఇందుకోసం అత్యుత్తమ విధాన నిర?యాలు తీసుకుంటున్నాం.' అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను కలిసిన ఏబీబీ అధ్యక్షుడు చున్యున్గుతో అన్నారు. సౌర, పవన, హైబ్రీడ్‌ విద్యుత్‌ రంగాలలో ఏపీ అనుసరిస్తున్న నూతన విధానాలను, అమరావతిలో కాలుష్య రహిత విద్యుత్‌ వాహనాలకు ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. ఏపీలో నెలకొల్పాలని ఏబీబీ తయారీ కేంద్రాన్ని నెలకొల్పాలని చున్యున్గును ముఖ్యమంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్‌ విధానాలను అధ్యయనం చేసి, తయారీ కేంద్ర ఏర్పాటుపై నిర?యం తీసుకుంటామని చున్యున్గు బదులిచ్చారు. మరోవైపు న్యూయార్క్లోని యూఎన్‌ జనరల్‌ అసెంబ్లీ సమావేశాల్లో నిర్వహించే 'వరల్డ్‌ లీడర్స్‌ ప్యానెల్స్‌'లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రిని 'బ్లూమ్బెర్గ్‌' సంస్థ సీఈవో జస్టిన్‌ స్మిత్‌ ఆహ్వానించారు. ముఖ్యమంత్రిని జస్టిన్‌ స్మిత్‌ మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.

 

Tags :