ASBL Koncept Ambience

డల్లాస్ లో 28 ఐటీ సర్వీస్ సంస్థలతో చంద్రబాబు చర్చలు

డల్లాస్ లో 28 ఐటీ సర్వీస్ సంస్థలతో చంద్రబాబు చర్చలు

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీ సంస్థ డెల్‌ ఆంధ్రప్రదేశ్‌లో డేటా సెంటర్‌ ఏర్పాటుకు ముందుకొచ్చింది. అమెరికాలో పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డల్లాస్‌లో డెల్‌ ప్రతినిధి శ్రీకాంత్‌ సత్యతో భేటీ అయ్యారు.  చంద్రబాబు బెల్‌ హెలికాప్టర్‌ డైరెక్టర్‌ చాద్‌ స్పార్క్‌తో భేటీ అయ్యారు. ఏపీలో తయారీ కేంద్రం ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలిస్తామని చాద్‌ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆయనతో మాట్లాడుతూ.. పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన పౌరవిమాన విధానం ఇప్పటికే తీసుకొచ్చామన్నారు. 75 మిలియన్‌ డాలర్లకు మించి పెట్టుబడులకు టైలర్‌ మేడ్‌ పాలసీ సిద్ధం చేస్తామన్నారు. రాష్ట్రానికి వచ్చి తమ అధికారులతో మాట్లాడాలని బెల్‌కు సూచించారు. అనంతరం ఐటీ సేవల రంగంలో పేరొందిన 28 సంస్థలకు చెందిన ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అయ్యారు. అమరావతి, విశాఖ నగరాల్లో లీజ్‌ స్థలాల్లో కార్యకలాపాలకు ఆయా సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. దీంతో ప్రాథమిక దశలో విశాఖలో 310, అమరావతిలో 65 ఉద్యోగాలు కల్పించనున్నారు.

 

Tags :