ASBL Koncept Ambience

కావాలంటే నేనే తెలంగాణకు రూ.500 కోట్లు ఇస్తా : చంద్రబాబు

కావాలంటే నేనే తెలంగాణకు రూ.500 కోట్లు ఇస్తా : చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చూసి కేసీఆర్‌ ఓర్వలేకపోతున్నారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తాను అభివృద్ధి చేసిన హైదరాబాద్‌ బంగారు బాతని, అప్పనంగా కేసీఆర్‌ కొట్టేశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒకటి కాదు 10 హైదరాబాద్‌లు తయారు చేసుకోవాలన్నారు. మనల్ని అడ్డుకునేందుకు కేసీఆర్‌, మోదీ ఏకమయ్యారని అన్నారు. జగన్‌తో కలిసి ఏపీని దెబ్బతీయాలనుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ మనకు భిక్షం వేస్తామన్నారని, అవసరమైతే తానే మీకు రూ.500 కోట్లు ఇస్తానని అన్నారు. హైదరాబాద్‌ని అమరావతి మించిపోతుందనే భయంతోనే.. జగన్‌తో కేసీఆర్‌ చేతులు కలిపారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. జగన్‌ తన దొంగ ఆస్తులు కాపాడుకోవాలని, కేసుల నుంచి బయటపడాలనే యావతోనే కేసీఆర్‌తో చేతులు కలిపి ఏపీని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు.

Tags :