టీడీపీదే ఘన విజయం : చంద్రబాబు
కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే ఎన్నికల్లో గెలుపుపై తమకు ఏమాత్రం అనుమానం లేదని కచ్చితంగా టీడీపీనే ఘనవిజయం సాధిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఒంగోలులో నిర్వహించిన టీడీపీ ఎన్నికల ప్రచార సన్నాహక సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా టీడీపీకి సానుకూలంగా ఉన్నారని చెప్పారు. టీడీపీని మరింత శక్తివంతమైన పార్టీగా తయారు చేసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. తనకు సమర్థవంతమైన సైన్యం ఉందని అలెగ్జాండర్ చెప్పేవారని, టీడీపీకి కూడా 65 లక్షల పసుపు సైన్యం ఉందన్నారు. డ్వాక్రా సంఘాల్లో కోటి మంది చెల్లెమ్మలు తనకు ఉన్నారని.. ఏ నాయకుడికీ ఇంతమంది చెల్లెమ్మలు ఉండరని వ్యాఖ్యానించారు.
Tags :