డాలస్ లో మహాత్మా గాంధీకి ఘన నివాళి
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డాలస్, టెక్సాస్ లో నెలకొని ఉన్న అమెరికా లోనే అతి పెద్దదైన మహాత్మా గాంధీ మెమోరియల్ ను మే 6, 2017 న సందర్శించి జాతిపిత మహాత్మా గాంధీ కి నివాళులు అర్పించారు. ఆలోచనాత్మకంగా, అత్యంత సుందరంగా ఈ మహాత్మా గాంధీ మెమోరియల్ ను నిర్మించడంలో మహాత్మా గాంధీ మెమోరియల్ చైర్మన్ డాక్టర్ ప్రసాద్ తోటకూర చూపిన నాయకత్వ ప్రతిభను ముఖ్యమంత్రి అభినందించారు. ఇదే సందర్భములో ఇర్వింగ్ నగర మేయర్, సంభందిత అధికారులను ఒప్పించి ఒక మిలియన్ డాల్లర్ల తో ఐదు నెలల వ్యవధిలో నాలుగు సంవత్సరాలకు పైగా శ్రమించి ఇటువంటి మహోత్తర నిర్మాణాన్ని నెలకొల్పడానికి ఎంతో కష్టపడిన డాక్టర్ ప్రసాద్ తోటకూరను, ఎం.జి.ఎం.ఎన్.టి సభ్యులు రావు కల్వల, ఎంవిఎల్ ప్రసాద్, పీయూష్ పటేల్, జాన్ హామండ్, షబ్నమ్ మోద్గిల్, సల్మాన్ ఫర్షోరి,జాక్ గధ్వాని, తైయబ్ కుండవాలా, కమల్ కౌశల్ ను ముఖ్యమంత్రి కొనియాడారు.
ఎంతో తీరికలేని సమయంలో కూడా వీలు చేసుకొని వచ్చి మహాత్మా గాంధీ మెమోరియల్ ను సందర్శించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఆర్ధిక శాఖ మంత్రి యనుమల రామకృష్ణుడుకి, ప్రభుత్వ మీడియా సలహాదారులు పరిటాల ప్రభాకర్ కు, ఏ.పి.ఎన్. ఆర్.టి సీఈఓ డాక్టర్ రవి వేమూరుకు మరియు ఇతర ప్రభుత్వ ప్రతినిధులు అందరికి ఎం.జి.ఎం.ఎన్.టి ఛైర్మన్ డాక్టర్ ప్రసాద్ తోటకూరప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేశారు.