ప్రజాకూటమి వస్తే ఆ పార్టీ అభ్యర్థే సీఎం
తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు ఏకమైన ప్రజాకూటమిలో సీఎం అభ్యర్థి ఎవరనేదానిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సృష్టత నిచ్చారు. ప్రజాకూటమి వస్తే కాంగ్రెస్ అభ్యర్థే సీఎం అని తేల్చి చెప్పారు. తనకు పదవీ వ్యామోహం లేదని, ప్రధాని కావాలన్న ఆశ లేదని తెలిపారు. రాజేంద్రగనర్‌లో నిర్వహించిన రోడ్ షోలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ అబద్దాల కోరు అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నోరు పారేసుకోవడం మోదీ, కేసీఆర్‌కు అలవాటన్నారు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలని హితవు పలికారు. జీఎస్టీ, నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బంది పడ్డారన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణే కూటమి ధ్యేయమని సృష్టం చేశారు. దేశ ప్రజలంతా అభద్రతాభావంతో ఉన్నారన్నారు. తెలుగు రాష్ట్రాలను కేంద్రం మోసం చేసిందని విమర్శించారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి కుంటుపడిందన్నారు. ప్రజాకూటమి అధికారంలోకి రాగానే ఏడాదికి 6 సిలిండర్లు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.