ASBL Koncept Ambience

నాలెడ్జ్ ఎకానమీలో మీరు భాగస్వాములు కావాలి - చంద్రబాబు

నాలెడ్జ్ ఎకానమీలో మీరు భాగస్వాములు కావాలి - చంద్రబాబు

(చెన్నూరి వెంకట సుబ్బారావు)

ఐటీరంగంలోనూ, వివిధరంగాల్లోనూ తెలుగువాళ్ళు అగ్రస్థానంలో ఉన్నారని, ఇప్పుడు నాలెడ్జ్‌ ఎకానమీలో కూడా ఎన్నారైలు ముందుండాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు నాయుడు చెప్పారు. అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్‌లో ఎన్నారైలు ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. నాడు ఐటీకి నేను ఇచ్చిన ప్రాధాన్యం వల్ల నేడు ఎంతోమంది అమెరికాలో అగ్రస్థానంలో ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. హైదరాబాద్‌లో హైటెక్‌సిటీ నిర్మించి నేడు 20 సంవత్సరాలు అయింది. ఐటీకీ ఉన్న ప్రాధాన్యాన్ని నేను ఆనాడే గుర్తించాను. ఆనాడే బిల్‌గేట్స్‌ను కలిసి మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ను హైదరాబాద్‌లో పెట్టాలని కోరినప్పుడు మొదట వద్దన్న బిల్‌గేట్స్‌ తరువాత నాకు 10 నిముషాలు అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. తరువాత నేను మాట్లాడటం మొదలు పెట్టిన తరువాత పది నిముషాలు అయిపోయి అరగంటకుపైగా బిల్‌గేట్స్‌తో సమావేశమయ్యాను.

మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ను హైదరాబాద్‌లో పెట్టమని కోరిన నేను అదే మైక్రోసాఫ్ట్‌కు తెలుగు బిడ్డ అధినేతగా ఉండటం చూసి నేను ఆనాడు కన్న కలలు నేడు నిజమయ్యాయని అనుకున్నాను.  బిల్‌గేట్స్‌ ఆయనే స్వయంగా హైదరాబాద్‌కు వచ్చి నన్ను కలిశారు. నా గురించి తెలుసుకుని ఆయనే స్వయంగా హైదరాబాద్‌కు వచ్చారు. నాతో సమావేశమయ్యారు. ఇలా ఐటీకీ నేను ఇచ్చిన ప్రాధాన్యం వల్ల నేడు ప్రపంచంలోని చాలా దేశాల్లో తెలుగువాళ్ళు కనిపిస్తున్నారు. ప్రపంచంలో అన్నీ దేశాల్లో ఉన్న ఏకైక కమ్యూనిటీ తెలుగుజాతి అని నేను గర్వంగా చెబుతున్నాను. తెలుగువాళ్ళకు ఉన్న తెలివితేటలను అన్నీ దేశాలు నేడు గుర్తించాయి. మీరు ఎక్కడ ఉన్నా రాణించే సత్తాను సంపాదించుకున్నందుకు నేను గర్వపడుతున్నాను. అమెరికాలోనూ, ఆంధ్రప్రదేశ్‌లోనూ సామాజికసేవ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. 

ఉద్యోగంతోనూ మీ ప్రతిభ ఆగిపోకూడదు. మీరు ఎంట్రప్రెన్యూరర్‌ కావాలని నేను ఆనాడే చెప్పాను. నాలెడ్జ్‌ ఎకానమీలో మీరు భాగస్వాములు కావాలని నేను కోరుకుంటున్నాను. భవిష్యత్తులో నాలెడ్జ్‌ ఎకానమికే ప్రాధాన్యం ఉంది. కష్టపడటంలో ముందుండే జ్యూయిష్‌ జాతిలాగా తెలుగువాళ్ళు కూడా కష్టపడి పనిచేస్తారని, ఈ శ్రమే మిమ్మల్ని అగ్రస్థానంలో నిలబెడుతుంది.  మెకనైజేషన్‌, ఇండస్ట్రియలైజేషన్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ తరువాత నేడు ఐఓటీ, నాలెడ్జ్‌ ఎకానమీ వచ్చింది. అందువల్ల నాలెడ్జ్‌ ఎకానమీలో మీరు ముందుండాలని నేను కోరుతున్నాను. 

Click here for Photogallery

Tags :